షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ హీరో నితిన్.. ఆందోళ‌న‌లో అభిమానులు

షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ హీరో నితిన్.. ఆందోళ‌న‌లో అభిమానులు

ఇటీవ‌లి కాలంలో హీరోలు ప్ర‌మాదాల బారిన ప‌డుతుండ‌డం ఎక్కువ చేస్తున్నాం. డూప్స్ అవ‌స‌రం లేకుండా స్టంట్స్ చేస్తూ లేని పోని స‌మ‌స్య‌లు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు యంగ్ హీరో నితిన్ కూడా షూటింగ్‌లో పెను ప్ర‌మాదానికి గురైన‌ట్టు తెలుస్తుంది. గత ఏడాది డైరెక్టర్ వ‌క్కంతంవంశీ దర్శకత్వంలో ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అనే సినిమా చేయ‌గా, ఈ మూవీ ఫ్లాప్ గా నిలిచింది.. దీంతో ఈ సారి పక్కా హిట్ కొట్టాల‌నే క‌సితో పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమా టైటిల్ తో ఒక సినిమాని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తూ ఉండగా దిల్ రాజు నిర్మిస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ కోసం ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి అడవులకు చిత్రబృందం వెళ్లినట్టుగా తెలుస్తోంది.

మారేడుమిల్లిలో భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్న స‌మ‌యంలో నితిన్ కు గాయాలైనట్టుగా తెలుస్తోంది. దీంతో వెంటనే షూటింగ్ క్యాన్సిల్ చేసి ఆయ‌న‌ను ఆసుపత్రికి త‌ర‌లించిన‌ట్టు స‌మాచారం.. నితిన్ చేతికి గాయాలు అవ్వడంతో ఆయ‌న‌ను మూడు వారాలపాటు రెస్టు తీసుకోవాలని వైద్యులు తెలియజేశారు. నితిన్ అభిమానులు సరైన సక్సెస్ కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్న స‌మ‌యంలో అత‌నికి ఇలాంటి ప్రమాదం జ‌ర‌గ‌డం అభిమానుల‌ని కూడా ఎంత‌గానో క‌ల‌వ‌ర‌ప‌రుస్తుంది. నితిన్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని, త‌మ్ముడు సినిమాతో తిరిగి క‌మ్‌బ్యాక్ ఇవ్వాల‌ని అభిమానులు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు.

శ్రీనివాస క‌ళ్యాణం చిత్రం త‌ర్వాత దిల్ రాజు తో నితిన్ చేస్తున్న సినిమా ఇది.ఈ మూవీని మీడియం రేంజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్న‌ట్టు తెలుస్తోంది. గ‌త కొంత కాలంగా ఫ్లాపులు చ‌వి చూస్తున్న నితిన్ త‌న తాజా చిత్రంలోను ప‌వ‌న్ రిఫరెన్స్ వాడుకొని మంచి హిట్ కొట్టాల‌ని అనుకుంటున్నాడు. త‌మ్ముడు చిత్రం అక్కా తమ్ముడు అనుబంధంతోనే ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. ఇక నితిన్ చివ‌రిగా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్’ అనే చిత్రం చేయ‌గా, ఈ మూవీని నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా తో దర్శకుడిగా మారిన వక్కంతం వంశీ తెరకెక్కించారు. సీనియర్‌ హీరో రాజశేఖర్‌ మరో కీలక పాత్రలో నటించారు. డిసెంబర్‌ 8న థియేటర్లలోకి వచ్చిన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్’ యావరేజ్‌గా నిలిచింది.