పూనమ్‌కి సోకిన వ్యాధితో బట్టలు వేసుకోలేని స్థితి.. హీరోయిన్స్‌కే ఎందుకిలాంటి వ్యాధులు?

బయటకు చాలా అందంగా కనిపించే హీరోయిన్స్ తమ జీవితాలలో చెప్పుకోలేని వ్యాధులతో బాధపడుతుండడం అభిమానులని కలవరపరుస్తుంది. చూడడానికి చాలా సంతోషంగానే కనిపిస్తున్నా లోలోపల మాత్రం మానసికంగా, శారీరకంగా అష్టకష్టాలు పడుతున్నారు. చాలామంది స్టార్ హీరోయిన్స్ ఈమధ్య కాలంలో మానసిక శారీరక రుగ్మతలకు గురి అవుతుండడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.. తాజాగా ఓ హీరోయిన్ తనకు అరుదైన వ్యాధి సోకినట్టు తెలియజేసింది. మరి ఆ హీరోయిన్ ఎవరో కాదు పూనమ్ కౌర్. సోషల్ మీడియాలో విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతూ నిత్యం వార్తలలో నిలుస్తూ ఉండే పూనమ్ తాజాగా సోషల్ మీడియాలో తనకి ఫైబ్రోమయాల్జియా సోకినట్టు తెలియజేసింది. సమంతకి సోకినా మాయోసైటిస్ కి కాస్త దగ్గరగా ఈ లక్షణాలు ఉంటాయట.
ఫైబ్రోమయాల్జియా వ్యాధి శారీరక ఒత్తిడి, మానసిక ఒత్తిడి ముఖ్యంగా ఎమోషనల్ గా ఫీల్ కావడం వల్ల వస్తుంది అని చెబుతున్నారు. కారు ప్రమాదం లాంటి యాక్సిడెంట్స్ వల్ల కూడా ఈ వ్యాధి మొదలవుతుందని ఈ వ్యాధి సోకడం వలన శరీరం మొత్తం నొప్పులు ఉంటాయి. ఈ వ్యాధి జాయింట్స్ ని, కండరాలని డ్యామేజ్ చేయదు కానీ.. నొప్పులకు కారణం అవుతుంది అని అంటున్నారు. పడుకొని లేచిన తర్వాత వారి శరీరం బిగుసుకుపోయినట్లు అనిపిస్తుంది. అలసట, డిప్రెషన్, యాంగ్జైటీ ఉంటాయట. ఈ వ్యాధి ఎక్కువగా మహిళలకు సోకుతుంది. 18 ఏళ్ళు పైబడిన వారు ఈ వ్యాధికి గురవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
మూడేళ్ళుగా ఈ వ్యాధితో పూనమ్ నరకం అనుభవిస్తున్నట్లు చెబుతోంది. కనీసం బట్టలు వేసుకోవడం కూడా కుదరడం లేదని, అంత తీవ్రంగా ఈ వ్యాధి ఉన్నట్లు పూనమ్ చెబుతోంది. గతంలో పూనమ్ ఈ వ్యాధి కోసం కేరళలో ఆయుర్వేద వైద్యం ప్రయత్నించిందట. ఇప్పుడు నేచురోపతి డాక్టర్ మంతెన సత్యనారాయణని కలిసినట్లు పూనమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆయన నుంచి విలువైన సలహాలు తీసుకున్నట్లు తెలియజేసింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.