ప్ర‌గ‌తి కూతురుని చూస్తే ఎంత‌టి స్టార్ హీరోయిన్ అయిన కుళ్లుకోవ‌ల్సిందే..!

ప్ర‌గ‌తి కూతురుని చూస్తే ఎంత‌టి స్టార్ హీరోయిన్ అయిన కుళ్లుకోవ‌ల్సిందే..!

తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప్ర‌గ‌తి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌నదైన అందం, అభిన‌యంతో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది ఈ అందాల ముద్దుగుమ్మ‌.ప్రగతి 1993లోనే చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. శభాష్ రాము అనే సినిమాలో ఓ చిన్న పాత్రలో మెరిసిన ఈ భామ‌… ఆ తర్వాత దాదాపు తొమిదేళ్లు గ్యాప్‌ తీసుకుని బాబీ సినిమాతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చింది.ఇందులో మహేష్‌బాబు తల్లిగా న‌టించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఇక అప్ప‌టి నుండి ప్రగతి వెనక్కి తిరిగి చూసుకునే రోజు రాలేదు. బ్యాక్‌ టు బ్యాక్ ప్రాజెక్ట్‌లతో తెగ బిజీ అయిన ఈ భామ ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ సినిమాల్లోనూ నటించింది. ఇక ప్ర‌గ‌తి ట్రెండ్ కి త‌గ్గ‌ట్టు దూసుకుపోతుంది.

సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఇంట్రెస్టింగ్ వీడియోలు షేర్ చేస్తుంది. ప్రగతి ఫిట్‌నెస్, వెయిట్ లిఫ్టింగ్ వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంటాయి. ప్ర‌గతికి వెయిట్ లిఫ్టింగ్ అంటే ఇష్టం. ఇటీవలే బెంగళూరులో 28వ బెంచ్ ప్రెస్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ జ‌ర‌గ‌గా, ఆ పోటీలో ఏకంగా మూడో స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే చాలా ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్న ప్ర‌గ‌తి అనుకోని కార‌ణాల వ‌ల‌న విడాకులు తీసుకుంది. అయితే చాలామందికి ప్రగతికి ఓ టీనేజ్ వయస్సున్న కూతరు ఉందని తెలియదు.

తాజాగా ప్రగతి తన కూతురును అభిమానులకు పరిచయం చేశారు.సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రగతి .. కూతురు ఫొటోలను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో అవి నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ప్ర‌గ‌తి కూతురు పేరు గీత కాగా, ఆమె ఫ్లస్ టూ చదువుతుందని టాక్. తల్లి మాదిరిగానే కూతురు గీత చాలా అందంగా ఉండ‌గా, త్వ‌ర‌లో ఆమె హీరోయిన్‌గా కూడా ఎంట్రీ ఇవ్వ‌డం ఖాయం అని కొంద‌రు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ప్ర‌గ‌తి కూతురు గీత పిక్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.