Pragathi | రెండో పెళ్లి రూమర్స్‌పై నటి ప్రగతి క్లారిటీ.. “సరైన వ్యక్తి లేకపోతే అదే కష్టం”
Pragathi | టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత తల్లి, అక్క, వదిన వంటి పాత్రల్లో సహజంగా ఒదిగిపోయి ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు. ప్రస్తుతం సినిమాలకంటే ఎక్కువగా సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్‌గా ఉంటూ, ఫిట్‌నెస్, జిమ్ వర్కౌట్స్, వెయిట్ లిఫ్టింగ్‌తో యువతకే షాక్ ఇస్తున్నారు.
Pragathi | టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత తల్లి, అక్క, వదిన వంటి పాత్రల్లో సహజంగా ఒదిగిపోయి ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు. ప్రస్తుతం సినిమాలకంటే ఎక్కువగా సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్‌గా ఉంటూ, ఫిట్‌నెస్, జిమ్ వర్కౌట్స్, వెయిట్ లిఫ్టింగ్‌తో యువతకే షాక్ ఇస్తున్నారు. ఇటీవల నటి ప్రగతి రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ రూమర్స్‌పై పెద్దగా స్పందించని ఆమె, తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాత్రం ఈ అంశంపై ఓపెన్‌గా మాట్లాడారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.
సినిమాలపై ఆసక్తితో మద్రాస్ వెళ్లిన ప్రగతికి, తమిళ నటుడు భాగ్యరాజ్ అవకాశం ఇచ్చారు. ఆయన తెరకెక్కించిన ‘వీట్ల విశేషాంగ’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రగతి, ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పలు సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ సాఫీగా సాగుతున్న సమయంలోనే వివాహం చేసుకున్న ఆమె, పెళ్లి తర్వాత దాదాపు మూడు నుంచి నాలుగు సంవత్సరాలు ఇండస్ట్రీకి దూరమయ్యారు. అనంతరం తిరిగి రీ ఎంట్రీ ఇచ్చి, సినిమాలతో పాటు సీరియల్స్‌లోనూ నటిస్తూ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా కొనసాగుతున్నారు.
వయసు పెరుగుతున్నా ఫిట్‌నెస్ విషయంలో మాత్రం ప్రగతి ఎక్కడా రాజీ పడడం లేదు. గంటల తరబడి జిమ్‌లో కసరత్తులు చేయడమే కాదు, వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లోనూ పాల్గొంటున్నారు. ఈ ఏడాది అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలో పాల్గొని సిల్వర్ మెడల్ సాధించడం విశేషం. వ్యక్తిగత జీవితంపై మాట్లాడిన ప్రగతి, చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్న తనకు వైవాహిక జీవితం అంత సాఫీగా సాగలేదని వెల్లడించారు. భర్త ప్రవర్తనతో విసిగిపోయి విడాకులు తీసుకుని, కొడుకు, కూతురితో బయటకు వచ్చానని తెలిపారు. హీరోయిన్‌గా కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో పెళ్లి చేసుకోవడం తన జీవితంలో తీసుకున్న పెద్ద పొరపాటని కూడా ఆమె గతంలోనే చెప్పుకొచ్చారు.
ఇక తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రెండో పెళ్లిపై స్పందిస్తూ, “జీవితంలో ఒక తోడు అవసరమే. కానీ సెలెక్ట్ చేసుకున్న వ్యక్తి చాలా మంచి వ్యక్తి అయి ఉండాలి. నా మెచ్యూరిటీ లెవల్‌కు సరిపోయే వ్యక్తి దొరకకపోతే మళ్లీ అదే కష్టమే” అని అన్నారు. అలాగే, “పెళ్లయ్యాక నువ్వు ఇలా ఉండాలి, అలా చేయాలి అంటూ కట్టుబాట్లు పెడితే నేను భరించలేను. ఒకవేళ నేను 20 ఏళ్ల వయసులో ఉంటే సర్దుబాటు అయ్యేదాన్ని. కానీ ఇప్పుడు నా వయసు, నా ఆలోచనలు వేరేలా ఉన్నాయి. పెళ్లిపై ప్రస్తుతం ఎలాంటి ఆశలు లేవు” అని స్పష్టంగా చెప్పారు. తన పిల్లల గురించి మాట్లాడుతూ, “కొడుకు చదువు పూర్తి చేసుకుని ప్రస్తుతం బెంగళూరులో పని చేస్తున్నాడు. కూతురు యూఎస్‌లో చదువుకుంటోంది. నేను నా పిల్లలతో చాలా క్లోజ్‌గా ఉంటాను, ఫ్రెండ్‌లా చూసుకుంటాను. సమాజానికి మంచి పిల్లలను ఇచ్చానన్న సంతృప్తి నాకు ఉంది. ఆ విషయంలో నేను గర్వంగా ఫీలవుతాను” అని తెలిపారు. మొత్తానికి రెండో పెళ్లి రూమర్స్‌పై ప్రగతి ఇచ్చిన క్లారిటీ, ఆమె వ్యక్తిగత జీవితం గురించి చేసిన ఓపెన్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారి తీస్తున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram