ద‌గ్గుబాటి వారింట పెళ్లి సంద‌డి.. రానా త‌మ్ముడి వివాహం ఏ దేశంలో అంటే..!

  • By: sn    breaking    Dec 03, 2023 11:25 AM IST
ద‌గ్గుబాటి వారింట పెళ్లి సంద‌డి.. రానా త‌మ్ముడి వివాహం ఏ దేశంలో అంటే..!

ఇటీవ‌ల టాలీవుడ్‌లో పెళ్లి సంద‌డి నెల‌కొంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్‌గా ఉన్న‌వారంద‌రు ఒక్కొక్క‌రుగా పెళ్లి పీట‌లెక్కేస్తున్నారు. శ‌ర్వానంద్, వ‌రుణ్ తేజ్ వివాహాలు ఇటీవ‌ల కాగా ఇప్పుడు రానా సోద‌రుడు కూడా వివాహం చేసుకోబోతున్నాడు అంటూ కొద్ది రోజులుగా ప్ర‌చారం న‌డుస్తుంది. అయితే దీనిపై పూర్తి క్లారిటీ రావడం లేదు. తాజా స‌మాచారం ప్ర‌కారం అభిరామ్ పెళ్లికి సంబంధించి ఏర్పాట్లు జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తుండ‌గా, డిసెంబ‌ర్ 6న పెళ్లి జ‌ర‌ప‌నున్న‌ట్టు టాక్. ఇక అభిరామ్ వెడ్డింగ్ డెస్టినేష‌న్ వెడ్డింగ్‌గా జ‌ర‌గ‌నుంద‌ని స‌మాచారం.

అంద‌రికి భిన్నంగా అభిరామ్ త‌న వివాహాన్ని శ్రీలంక‌లో జ‌రుపుకోబోతున్నార‌ట‌. శ్రీలంకలోఫైవ్ స్టార్ రిసార్ట్ అయిన అనంతర కలుతారాలో పెళ్లి చేసుకోబోతున్నాడ‌ని ఫిలిం న‌గ‌ర్ స‌మాచారం. డిసెంబర్ 6న రాత్రి 8 గం.ల 50 ని. లకు ప్రత్యూష చపరాల మెడలో అభిరామ్ దగ్గుబాటి మూడు ముళ్లు వేయబోతున్నట్టు టాలీవుడ్ వ‌ర్గాల ద్వారా స‌మాచారం అందుతుంది. ఈ పెళ్లికి 200 మందికి పైగా అతిధులు హాజరవుతారని సమాచారం. ఇరు వర్గాల బందుమిత్రులు, సినీ,రాజకీయ సెలబ్రిటీలు ఈ పెళ్లిలో సందడి చేయబోతుండ‌గా, వీరంద‌రికి అక్క‌డ ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసినట్టు స‌మాచారం. సోమ‌వారం నుండే పెళ్లి హంగామా మొద‌లు కానుంద‌ట‌. వ‌రుణ్ తేజ్ పెళ్లి మాదిరిగానే అభిరామ్ వివాహం కూడా మూడు రోజుల పాటు జ‌ర‌గ‌నుందట‌.

సోమవారం రాత్రి పార్టీతో స్టార్ట్ అయ్యి..సంగీత్.. ఆతరువాత మంగళవారం సాయంత్రం మెహందీ వేడుక, అనంతరం విందు ఏర్పాటు చేస్తారు.ఇక బుధవారం ఉదయం 10:30 గంటలకు పెళ్లికూతురు వేడుక నిర్వహించి అనంతరం సాయంత్రం 7 గంటలకు వివాహ వేడుకలు ప్రారంభమవుతాయని ఇండ‌స్ట్రీ టాక్. ఇక రాత్రి 8:50 గంటలకు సుముహూర్తాన్ని నిర్ణయించిన‌ట్టు తెలుస్తుంది. పెళ్లి జ‌ర‌గిన త‌ర్వాత హైద‌రాబాద్‌కి రానున్న ఈ జంట సినీ, రాజకీయ నాయ‌కుల కోసం రిసెప్ష‌న్ కూడా జ‌రుపుకోనున్నార‌ట‌. మ‌రి అభిరామ్ పెళ్లికి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న ఎప్పుడు వ‌స్తుందో చూడాలి. అభిరామ్ విష‌యానికి వ‌స్తే.. తేజా డైరెక్షన్ లో అహింస సినిమాలో న‌టించాడు. తొలి సినిమానే పెద్ద డిజాస్ట‌ర్ అయింది. రానున్న రోజుల‌లో మంచి స్క్రిప్ట్ ఎంపిక చేసుకొని సినిమాలు చేయాల‌ని భావిస్తున్నాడు.