ద‌గ్గుబాటి అభిరామ్ పెళ్లి కోసం షూట్స్ అన్నీ క్యాన్సిల్ వెళుతున్న శ్రీలీల.. ఎందుకంటే..!

  • By: sn    breaking    Dec 06, 2023 11:38 AM IST
ద‌గ్గుబాటి అభిరామ్ పెళ్లి కోసం షూట్స్ అన్నీ క్యాన్సిల్ వెళుతున్న శ్రీలీల.. ఎందుకంటే..!

తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు చిన్న కుమారుడు దగ్గుబాటి అభిరామ్ శ్రీలంకలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో డిసెంబర్ 6న రాత్రి 8.50 గంటలకు వివాహం చేసుకోబోతున్నాడు.గ‌త కొద్ది రోజులుగా అభిరామ్ పెళ్లికి సంబంధించి అనేక ప్ర‌చారాలు సాగుతున్నా కూడా అఫీషియ‌ల్ ప్రక‌ట‌న అయితే రాలేదు. అయితే పెళ్లి కోసం దగ్గుబాటి కుటుంబం అంతా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. వెంకటేష్, సురేష్ బాబు, నాగచైతన్య, రానా, అభిరామ్ మరియు కుటుంబసభ్యులు హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ద‌ర్శ‌న‌మివ్వ‌డంతో వారంతా పెళ్లి కోసం వ‌చ్చార‌ని అర్ధ‌మైంది.

అభిరామ్ పెళ్లి కోసమే వీరు శ్రీలంక పయనమైనట్ల అంద‌రు భావిస్తున్నారు. కారంచేడుకి చెందిన ప్ర‌త్యూష అనే అమ్మాయిని అభిరామ్ వివాహం చేసుకోబోతుండ‌గా, ఈ రోజు రాత్రి 8:50 గంటలకు ప్రత్యూష మెడలో మూడు మూళ్లు వేయనున్నాడు అభిరామ్.. స‌న్నిహితుల స‌మ‌క్షంలో ఈ వివాహం జ‌రుగుతుంద‌ని స‌మాచారం.. మొత్తం 200 మంది మాత్ర‌మే హాజ‌రు కానున్న‌ట్టు తెలుస్తోంది. అయితే స్టార్ హీరోయిన్ శ్రీలీల కూడా వీరి వివాహానికి హాజ‌రు కానుంద‌నే టాక్ వినిపిస్తుంది. పెళ్లికి హాజరయ్యేందుకు ఈ బ్యూటీ తన షెడ్యూల్‌లన్నింటినీ వదులుకుని వెళుతుందా అని అంద‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇందుకు కార‌ణం లేక‌పోలేదు మ‌రి.

దగ్గుబాటి అభిరామ్ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి.. వధువు, ప్రత్యూష శ్రీలీలకు నటికి చిన్ననాటి స్నేహితురాలు అని తెలుస్తుంది. ప్రత్యూష, శ్రీలీల అమెరికా కాలేజీలో కలిసి చదివిన స్నేహితులు కావ‌డంతో ప్రత్యూష కోసం తన షూటింగ్‌ను పక్కనబెట్టి శ్రీలీల పెళ్లికి వెళ్ల‌నుంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం శ్రీలీల గుంటూరు కారం అనే చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. అలానే ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో బిజీగా ఉంది. కాగా, తేజ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన అహింస సినిమాతో అభిరామ్ హీరోగా టాలీవుడ్‌కు ప‌రిచ‌యం అయ్యాడు. అయితే ఈ సినిమా అంచ‌నాలు అందుకోలేక‌పోయింది.