పొట్టి దుస్తుల‌లో ర‌ష్మిక క్రేజీ వ‌ర్క‌వుట్స్.. ఆ అందాలు చూసి యువ‌త చిత్తు

పొట్టి దుస్తుల‌లో ర‌ష్మిక క్రేజీ వ‌ర్క‌వుట్స్.. ఆ అందాలు చూసి యువ‌త చిత్తు

ఇప్పుడు దేశ వ్యాప్తంగా ర‌ష్మిక పేరు మారుమ్రోగుతుంది. అందుకు కార‌ణం రష్మిక ఫేక్‌ వీడియో నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేయ‌డ‌మే. ర‌ష్మిక మందన్న ఏఐ డీప్‌ఫేక్ వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో స‌ర్క్యులేట్ కాగా, ఇది చూసిన సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డ‌మే కాక ఈ చ‌ర్య‌ని ఖండించారు. అమితాబ్‌ బచ్చన్‌, ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్‌, నాగచైతన్య, మృణాళ్‌ ఠాకూర్, చిన్మయి, మంచు విష్ణు , విజయ్‌ దేవరకొండ వంటి వారు రష్మిక ఫేక్‌ వీడియోపై రియాక్ట్‌ అయ్యారు. మ‌రోసారి ఇలాంటివి జ‌ర‌గ‌కుండా గ‌ట్టి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. రష్మిక కూడా ఈ ఇష్యూపై స్పందించి త‌న‌కు స‌పోర్ట్ చేసిన వారికి ధన్యవాదాలు తెలిపింది.

ఇక తాజాగా ర‌ష్మిక వ‌ర్క‌వుట్ వీడియో ఒక‌టి నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ర‌ష్మిక ఇందులో పొట్టి దుస్తులు ధ‌రించి క్రేజీగా వ‌ర్క‌వుట్స్ చేస్తుంది. మ‌రోవైపు టైట్ డ్రెస్‌లో అందాల ఆర‌బోత‌కి దిగిన ఈ అమ్మ‌డు కుర్రాళ్లని కుదురుగా ఉండ‌నివ్వ‌డం లేదు. టైట్ షార్ట్‌, టీషర్ట్ ధరించి హాట్‌ యాంగిల్స్ లో వర్కౌట్స్ చేస్తున్న ర‌ష్మిక‌ని చూసి ప్ర‌తి ఒక్క‌రు మురిసిపోతున్నారు. ప్ర‌స్తుతం ర‌ష్మిక హాట్ వీడియో కూడా సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది. ఈ వీడియోలో రష్మిక చెబుతూ, మీరు మంచి వ్యాయామం చేసిన తర్వాత అది మీకు మంచి రోజుగా మారుతుంది అని ర‌ష్మిక పేర్కొంది.

ఇక తను ఫిజికల్‌గా మరింత బలంగా మారుతున్నట్టు ర‌ష్మిక చెప్పుకు రాగా, పరోక్షంగా ఇటీవల జరిగిన పరిణామాలపై రష్మిక ఇలా రియాక్ట్ అయి ఉంటుంద‌ని కొంద‌రు చెప్పుకొస్తున్నారు. ఛ‌లో సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన ఈ క‌న్న‌డ అందం ఒక్కో మెట్టు ఎక్కుతూ టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. మొద‌ట్లో అంత‌గా అందాల ఆర‌బోత చేయ‌ని ఈ అమ్మ‌డు మాత్రం క్రేజీ హాట్ లుక్స్‌తో కుర్రాళ్ల‌కి కంటిపై నిద్ర లేకుండా చేస్తుంది. ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్ , కోలీవుడ్‌ల‌ని దున్నేస్తుంది ర‌ష్మిక‌. ఈ అమ్మ‌డు న‌టించిన పుష్ప 2 చిత్రం త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, ఈ సినిమాపై ఎంతో హోప్స్ పెట్టుకుంది. బాలీవుడ్‌లో ర‌ష్మిక‌ `యానిమల్‌` మూవీ చేస్తుంది. ఇందులో రణ్‌బీర్‌ కపూర్‌కి జోడీగా నటిస్తుంది. పాన్‌ ఇండియా లెవల్‌లో ఈ చిత్రం డిసెంబర్‌ 1న విడుదల కాబోతుంది.