Ananya Nagalla | ఏంటి..ఈ బ్యూటీ ఆ హీరోతో ప్రేమ‌లో ప‌డిందా.. ఫ‌స్ట్ క్ర‌ష్ సీక్రెట్ కూడా రివీల్..!

Ananya Nagalla | టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యువ నటి అన‌న్య నాగ‌ళ్ల ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా కొనసాగుతోంది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె, నటనపై ఆసక్తితో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టింది. తర్వాత మ‌ల్లేషం సినిమాతో వెండితెరపై కనిపించి తన సహజ నటనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.

  • By: Sandeep |    movies |    Published on : May 16, 2026 12:05 PM IST
Ananya Nagalla | ఏంటి..ఈ బ్యూటీ ఆ హీరోతో ప్రేమ‌లో ప‌డిందా.. ఫ‌స్ట్ క్ర‌ష్ సీక్రెట్ కూడా రివీల్..!

Ananya Nagalla | టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యువ నటి అన‌న్య నాగ‌ళ్ల ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా కొనసాగుతోంది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె, నటనపై ఆసక్తితో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టింది. తర్వాత మ‌ల్లేషం సినిమాతో వెండితెరపై కనిపించి తన సహజ నటనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.

అయితే ఆమె కెరీర్‌కు మంచి మలుపు తీసుకొచ్చిన సినిమా వ‌కీల్ సాబ్. ఇందులో కీలక పాత్ర పోషించిన అనన్యకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఆ సినిమా తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ యంగ్ హీరోయిన్లలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంది.

ఆ హీరో ఫ‌స్ట్ క్ర‌ష్‌..

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనన్య తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. చిన్నప్పటి నుంచి మ‌హేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాలు చూస్తూ పెరిగానని చెప్పింది. అయితే తన ఫస్ట్ క్రష్ విషయానికి వస్తే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ నాగ శౌర్య పేరును వెల్లడించింది.

తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ, పెళ్లి విషయంలో కూడా తన అభిప్రాయాలను వెల్లడించింది. తన జీవిత భాగస్వామి నిజాయితీగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ప్రస్తుతం సరైన వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నానని చెప్పిన ఆమె, సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులతో రిలేషన్‌షిప్స్ విషయంలో కొంత భయం ఉందని అభిప్రాయపడింది.

వాటిని పెద్ద‌గా ప‌ట్టించుకోను..

సినీ పరిశ్రమలో ఎదురయ్యే పరిస్థితుల గురించి కూడా ఆమె స్పందించింది. ఇప్పటివరకు తనకు ఎలాంటి క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదురుకాలేదని స్పష్టం చేసింది. అలాగే సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్, నెగెటివ్ కామెంట్లను పెద్దగా పట్టించుకోనని, తన పని మీదే పూర్తిగా దృష్టి పెడతానని పేర్కొంది.

ఇక మరోవైపు నాగ శౌర్య విషయానికి వస్తే, ఒకప్పుడు వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న ఆయన గత కొన్నేళ్లుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అనన్య చేసిన “ఫస్ట్ క్రష్” కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.