పెళ్లి విషయంలో వెనకడుగు వేస్తున్న సాయి పల్లవి.. అసలు కారణం ఏంటంటే..!

లేడి పవర్ స్టార్ సాయి పల్లవి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఏ పాత్రలోనైన ఇట్టే ఒదిగిపోవడం, తన డ్యాన్స్‌తో ప్రేక్షకులకి ఫుల్ జోష్ తెప్పించడం సాయి పల్లవి స్పెషాలిటి. ఇటీవల సాయి పల్లవి స్లో అండ్ స్టడీగా సినిమాలు చేస్తూ వెళుతుంది. దీంతో ఈ అమ్మడు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుందంటూ జోరుగా ప్రచారం సాగింది. కట్ చేస్తే సాయి పల్లవి కన్నా ముందే ఆమె చెల్లి పెళ్లి జరగనుందని తెలుస్తుంది. సాయి పల్లవి సిస్టర్ పూజ కన్నన్.. తన క్రైం పార్ట్నర్ అయిన వినీత్ అనే వ్యక్తి ఇప్పుడు తన లైఫ్ పార్ట్నర్ కాబోతున్నాడంటూ తనకు కాబోయే భర్తను అభిమానులకు పరిచయం చేస్తూ.. అతడి ఫోటోను షేర్ చేసింది.
ఇతను వినీత్.. నా సన్ షైన్. మొన్నటి వరకు నా క్రైం పార్ట్ నర్. ఇప్పుడు నా లైఫ్ పార్ట్ నర్ కాబోతున్నాడు. ఐ లవ్ యూ మై పార్ట్ నర్ అంటూ ఇన్ స్టాలో రాసుకొచ్చింది పూజా కన్నన్. దీంతో సాయిపల్లవి ఇంట త్వరలోనే పెళ్లి బాజా మోగనుందని తెలుస్తుంది. తమిళంలో చిత్తరాయి సెవ్వనం సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమైంది పూజా కన్నన్.ఈ సినిమాలో పూజా నటనకి మంచి మార్కులే పడ్డ ఎందుకో తర్వాత సినిమాలపై అంత దృష్టి పెట్టలేకపోయింది. ఇదిలా ఉంటే సాయిపల్లవి పెళ్లి చేసుకోకుండా పూజా కన్నన్ పెళ్లి చేసుకోవడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.సాయిపల్లవికి పెళ్లి ఇష్టం లేదని అందుకే పూజాకన్నన్ పెళ్లికి సంబంధించి ప్రకటన వచ్చిందని సమాచారం
సాయిపల్లవి ప్రస్తుతం కెరీర్ పై ఫోకస్ పెట్టడం వల్లే కొన్నాళ్లపాటు పెళ్లికి దూరంగా ఉంటుందని అర్ధమవుతుంది. రానున్న రోజులలో మాత్రం తప్పక పెళ్లి చేసుకోనుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఇక సాయి పల్లవి ప్రస్తుతం తండేల్ చిత్రంలో నటిస్తుంది. చందూ మోండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. గత కొన్నేళ్లుగా సాయి పల్లవి నటించిన సినిమాలన్నీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. దీంతో తండేల్‌తో మంచి హిట్ కొట్టాలని ఈ ముద్దుగుమ్మ భావిస్తుంది.