ఐపీఎల్ వేలంలో చరిత్ర సృష్టించిన శామ్ కర్రన్..!
IPL Auction | ఐపీఎల్ వేలంలో ఇంగ్లండ్ ఆటగాడు శామ్ కర్రన్ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ వేలంలో పంజాబ్ జట్టు రూ.18.50కోట్లకు ఇంగ్లండ్ ఆల్ రౌండర్‌ను కొనుగోలు చేసింది. రూ.2కోట్ల బేస్‌ప్రైజ్‌తో వేలంలోకి రాగా.. అతని కోసం ఫ్రాంచైజీలు పోటీపడి రూ.17.50 కోట్లు వెచ్చించి పంజాబ్ కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో అత్యంత ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా నిలిచాడు. ఆసీస్ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను ముంబై ఇండియన్స్ రూ.17.5కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే ఇంగ్లండ్ ఆటగాడు బెన్‌స్టోక్స్‌ను […]

IPL Auction | ఐపీఎల్ వేలంలో ఇంగ్లండ్ ఆటగాడు శామ్ కర్రన్ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ వేలంలో పంజాబ్ జట్టు రూ.18.50కోట్లకు ఇంగ్లండ్ ఆల్ రౌండర్‌ను కొనుగోలు చేసింది. రూ.2కోట్ల బేస్‌ప్రైజ్‌తో వేలంలోకి రాగా.. అతని కోసం ఫ్రాంచైజీలు పోటీపడి రూ.17.50 కోట్లు వెచ్చించి పంజాబ్ కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో అత్యంత ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా నిలిచాడు. ఆసీస్ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను ముంబై ఇండియన్స్ రూ.17.5కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే ఇంగ్లండ్ ఆటగాడు బెన్‌స్టోక్స్‌ను రూ.16.25కోట్లకు చెన్నై సూపర్‌కింగ్స్ కొనుగోలు చేసింది. వెస్టిండిస్‌కు చెందిన జాసన్ హోల్డర్‌ను రాజస్థాన్ రూ.5.75కోట్లు, జింబాబ్వే ఆల్‌రౌండర్ సికిందర్ రజాను పంజాబ్ రూ.50లక్షలు, ఒడెన్ స్మిత్ (వెస్టిండిస్) రూ.50లక్షలకు అహ్మదాబాద్ కొనుగోలు చేసింది.
అలాగే ఇంగ్లండ్ క్రికెటర్ హ్యారీ బ్రూక్‌ను రూ.13.25కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. బ్రూక్ కోసం రాజస్థాన్, హైదరాబాద్ ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్స్‌ను అహ్మదాబాద్ బేస్ ప్రైజ్ రూ.2కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే టీమ్ ఇండియా ఆటగాడు మయాంకర్ అగర్వాల్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.8.25కోట్లకు దక్కించుకున్నది. మరో సీనియర్ ఆటగాడు అజింక్య రహానేను చైన్నై బేస్ ప్రైజ్ రూ.50లక్షలకు తీసుకున్నది. ఇంగ్లండ్ స్పెషలిస్ట్ ఆటగాడు జోరూట్, సౌతాఫ్రికా స్టార్ రైలీ రూసోను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. అలాగే బంగ్లా ప్లేయర్ షకీబల్ హసన్‌ను అమ్ముడుపోలేదు. బంగ్లా ఆటగాళ్లు వచ్చే ఏడాది సీజన్‌కు అందుబాటులో ఉండకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తున్నది. ఇవాళ కేరళలోని కొచ్చి వేదికగా మధ్యాహ్నం ఐపీఎల్ మినీ వేలం మొదలైంది.