బికినీలో బోల్డ్ లుక్స్.. స‌మంత ఎందుకిలా చేస్తుందంటూ ఫ్యాన్స్ ఫైర్

బికినీలో బోల్డ్ లుక్స్.. స‌మంత ఎందుకిలా చేస్తుందంటూ ఫ్యాన్స్ ఫైర్

ఏ మాయ చేశావే చిత్రంతో ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి ఆ త‌ర్వాత ఒక్కో సినిమాతో మంచి మార్కులు సంపాదించుకుంటూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది స‌మంత‌. నాగ చైత‌న్య‌ని పెళ్లాడిన త‌ర్వాత కూడా స‌మంత సినిమాలు చేయ‌డం ఆప‌లేదు. వైవిధ్య‌మైన సినిమాలు చేసి ప్రేక్ష‌కుల‌ని అల‌రించింది. అయితే ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో స‌మంత బోల్డ్‌గా న‌టించ‌డంతోనే చైతూ-స‌మంత మ‌ధ్య విబేధాలు ఏర్ప‌డ్డాయ‌ని అందుకే వారిద్ద‌రు విడిపోయారంటూ ప్ర‌చారం జ‌రిగింది. అయితే చైతూ నుండి విడిపోయాక స‌మంత మ‌రింత రెచ్చిపోతూ గ్లామ‌ర్ షో చేస్తుండ‌డం మనం చూస్తూనే ఉన్నాం. పుష్ప సినిమాలో ఐట‌మ్ సాంగ్ చేసి పెద్ద షాక్ ఇచ్చింది. ఇక సోష‌ల్ మీడియాలో ఎప్ప‌టిక‌ప్పుడు గ్లామ‌ర్ షోతో చెమ‌ట‌లు ప‌ట్టిస్తుంది.

స‌మంత కొన్నాళ్లుగా సామ్ మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి నుండి కోలుకుంటుంది. మ‌యోసైటిస్ వ‌ల‌న‌ సినిమాలకు కూడా కొద్ది రోజుల పాటు బ్రేక్ ఇచ్చింది. దాదాపు ఏడాదిగా ఎలాంటి ప్రాజెక్ట్ చేయ‌లేదు స‌మంత‌. కేవ‌లం సోష‌ల్ మీడియాలో త‌న అందాల ఫొటోలు షేర్ చేస్తూ ర‌చ్చ చేస్తుంటుంది. తాజాగా స‌మంత ఏకంగా బికినీలో క‌నిపించి కుర్రాళ్ల‌కి కంటిపై కునుకు లేకుండా చేసింది. మ‌యోసైటిస్ ట్రీట్‌మెంట్‌లో భాగంగా స‌మంత ప‌లు ప్రాంతాలు చుట్టేస్తుంది. ఒక ప‌క్క ట్రీట్‌మెంట్ తీసుకుంటూనే మ‌రోప‌క్క మెంటల్ కూడా స్ట్రాంగ్ అయ్యేందుకు ప్రకృతి మధ్య స‌ర‌ద‌గా గ‌డుపుతుంది.

ప్రపంచంలోని పలు ఆహ్లాదకరమైన ప్రదేశాలను చుట్టేస్తూ అక్క‌డికి సంబంధించిన అద్భుత‌మైన ప్ర‌దేశాల‌ని మ‌న‌కు కూడా ప‌రిచ‌యం చేస్తుంది. రీసెంట్‌గా ఈ అమ్మ‌డు మ‌లేషియాకి వెళ‌ల్ఇంది. అక్కడ అందమైన ప్రకృతి మధ్య ఉన్న ఓ అద్భుతమైన రిసార్ట్ లో చాలా స‌ర‌దాగా గ‌డుపుతూ వాటికి సంబంధించిన ఫొటోలు షేర్ చేసింది. స‌మంత బికినీలో క‌నిపించిన ఫొటో చూసి ఒక్కొక్క‌రు నోటిమీద వేలేసుకుంటున్నారు. మలేషియా సెలయేరులో బికినీ అందాలు ఆరబోస్తూ స‌మంత చేసిన హాట్ షోకి కొంద‌రు హీరోయిన్స్ కూడా అవాక్క‌వుతున్నారు. గురు బ్యూటీ రితికా సింగ్ ..ఉఫ్ అంటూ ఫైర్ ఎమోజిలను పోస్ట్ చేసింది. ఏది ఏమైన స‌మంత ఇలా బికినీలో క‌నిపించ‌డం మాత్రం అంద‌రికి షాకింగ్‌గా మారింది.