నా త‌ల్లే డ‌బ్బులు తీసుకొని వాళ్ల ద‌గ్గ‌ర ప‌డుకోబెట్టేది.. షకీలా షాకింగ్ కామెంట్స్

నా త‌ల్లే డ‌బ్బులు తీసుకొని వాళ్ల ద‌గ్గ‌ర ప‌డుకోబెట్టేది.. షకీలా షాకింగ్ కామెంట్స్

శృంగార తార ష‌కీలా గురించి సినీ ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఒక‌ప్పుడు స్టార్ హీరోల‌ని మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. షకీలా కోసం ఏకంగా గుడి క‌ట్టారంటే ఆమె క్రేజ్ ఎలాంటిదో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అప్ప‌ట్లో ష‌కీలా సినిమా విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది అంటే.. స్టార్ హీరోలు సైతం త‌మ సినిమాల‌ను వాయిదా వేసుకునేవారట‌. ఆమె న‌టించిన ప్ర‌తి చిత్రం కూడా నిర్మాత‌ల‌కి, డిస్ట్రిబ్యూట‌ర్స్‌కి కాసుల వ‌ర్షం కురిపించేది. అయితే ఇటీవ‌ల సినిమా అవ‌కాశాలు త‌గ్గడం, ఆమె ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో త‌న బాధ‌ల గురించి చెప్పుకొస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే రీసెంట్‌గా షకీలా బిగ్ బాస్ 7లో అడుగుపెట్టి రెండు వారాల పాటు సంద‌డి చేసింది.

తాజాగా ష‌కీలా త‌న సినిమా కెరీర్ తో పాటు జీవితంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను తెలియ‌జేసింది. త‌న ప్ర‌తిభని ఎవ‌రు గుర్తించ‌లేద‌ని, త‌న బాడీని, అందాన్ని చూసి డ‌బ్బు సంపాదించుకోవాల‌ని అనుకున్నారని షకీలా మ‌రోసారి త‌న ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ముందు నా త‌ల్లే డ‌బ్బు కోసం నా శ‌రీరాన్ని వాడుకుంది అని షకీలా షాకింగ్ కామెంట్ చేసింది. గ‌తంలో ఓ త‌మిళ మీడియాకి కూడా ఇదే విష‌యాన్ని తెలియ‌జేసింది ష‌కీలా. చిన్న‌ప్పుడు నేను చాలా బ‌లంగా, యాక్టివ్‌గా ఉండేదాన్ని. వ‌య‌స్సుని మించి హైట్ ఉండేది. హైస్కూల్ లో చదువుతున్నప్పుడే కాలేజ్ అమ్మాయిలా క‌నిపించేదాన్ని. అప్పుడు ఏదో ర‌కంగా చూసేవారు. అప్పుడు మా ఇంట్లో డ‌బ్బు స‌మ‌స్య ఉండేది. దాంతో మా అమ్మ మగవాళ్లను పరిచయం చేసి వాళ్ల గదికి వెళ్లమని చెప్పేది.

అప్పుడు నేను అందుకు ఒప్పుకోక‌పోతే బాగా కొట్టేది. నాకు వేరే మార్గం లేక.. నోరు మూసుకుని అమ్మ చెప్పినట్లు ఉండేదానిని అని షకీలా షాకింగ్ కామెంట్స్ చేసేది. డ‌బ్బు స‌మ‌స్య వ‌ల‌న మాఅమ్మమ్మ, అమ్మ కూడా నన్ను వాడుకొని డబ్బులు సంపాదించారు. వారు అదే మార్గంలో వెళ్ల‌డంతో నన్ను కూడా అదే దారిలో వెళ్లమన్నారు. కానీ ఆ దారిలో వెళ్లకుండా చిత్ర పరిశ్రమ ఎంచుకున్నాను. కానీ ఇక్కడ మాత్రం నా శరీరాన్ని కేవలం ప్రదర్శనకు వాడేవారని.. అందువలన నేను చాలా భాదపడ్డాను.. నాకు ఆర్టిస్టుగా ఉండే అర్హత ఉన్నా నన్ను ఎవరు ఇండస్ట్రీలో తీసుకోలేదు. నన్ను కెమెరా ముందు కీలుబొమ్మలా వాడుకున్నారని షకీలా స్ప‌ష్టం చేసింది. నా సోద‌రి నేను దాచిపెట్టిన డబ్బు మెుత్తం తీసుకొని న‌న్ను మోసం చేయ‌డం చాలా బాధించింద‌ని ష‌కీలా పేర్కొంది. కొన్నేళ్ల క్రితం ష‌కీలా.. మిల్ల అనే ట్రాన్స్‌జండ‌ర్ అమ్మాయిని ద‌త్త‌త‌గా తీసుకున్నారు. ఆమె బాధ్య‌త‌ల‌ను ష‌కీలానే చూసుకుంటున్నారు