గురువారం షిర్డీ సాయిబాబాను ఇలా పూజించి.. కోరిక‌లు నేర‌వేర్చుకోండి..!

గురువారం వ‌చ్చిందంటే.. ప్ర‌తి ఇంట్లో షిర్డీ సాయిబాబా నామ‌స్మ‌ర‌ణ జ‌రుగుతుంది. ఎందుకంటే గురువారం సాయిబాబా ఆరాధ‌న‌కు చాలా పవిత్ర‌మైన దినంగా భావిస్తారు. అందుకే సాయిబాబాను కొలిచే భ‌క్తులు.. ఆయ‌న ఆశీస్సులు పొందేందుకు గురువారం నాడు ఉప‌వాస దీక్ష చేసి, అనుగ్ర‌హం పొందుతారు.

గురువారం షిర్డీ సాయిబాబాను ఇలా పూజించి.. కోరిక‌లు నేర‌వేర్చుకోండి..!

హిందూ ధ‌ర్మంలో ప్ర‌తి రోజు ఒక్కో దేవుడికి ఒక్కో ప్ర‌త్యేక‌త ఉంది. గురువారం వ‌చ్చిందంటే.. ప్ర‌తి ఇంట్లో షిర్డీ సాయిబాబా నామ‌స్మ‌ర‌ణ జ‌రుగుతుంది. ఎందుకంటే గురువారం సాయిబాబా ఆరాధ‌న‌కు చాలా పవిత్ర‌మైన దినంగా భావిస్తారు. అందుకే సాయిబాబాను కొలిచే భ‌క్తులు.. ఆయ‌న ఆశీస్సులు పొందేందుకు గురువారం నాడు ఉప‌వాస దీక్ష చేసి, అనుగ్ర‌హం పొందుతారు. షిర్డీ సాయిబాబాను మ‌నస్ఫూర్తిగా ఆరాధిస్తే కోరిన కోరిక‌లు తీరుస్తాడ‌ని భ‌క్తుల విశ్వాసం. సాయిబాబా ఎప్పుడూ ‘సబ్ కా మాలిక్ ఏక్ హై ‘ అనే సందేశాన్ని ఇచ్చేవారు. విశ్వాసాల ప్రకారం, సాయిబాబా తనను పూర్తి విశ్వాసంతో పూజించే భక్తులకు ఎటువంటి కష్టము ఎదురైనా వాటిని తొలగిస్తాడని విశ్వాసం. మ‌రి సాయిబాబాకు పూజ చేసే విధానం గురించి తెలుసుకుందాం..

పూజా చేసే విధానం..

  • గురువారం తెల్ల‌వారుజామున బ్ర‌హ్మ ముహూర్తంలో నిద్ర లేవాలి. అనంత‌రం అభ్యంగ స్నానం చేసి.. పూజ గ‌దిలో వాలిపోవాలి.
  • షిర్డీ సాయిబాబాకు ఎంతో ఇష్ట‌మైన ప‌సుపు రంగు వ‌స్త్రాలు ధ‌రిస్తే మంచిది.
  • సాయిబాబా విగ్ర‌హాన్ని శుద్ధ‌మైన జ‌లంతో లేదా పంచామృతంతో(పాలు, పెరుగు, తేనే, పంచదార‌, నెయ్యి) అభిషేకం చేయాలి.
  • బాబాను ప‌సుపు రంగు వ‌స్త్రం, పువ్వులతో అలకరించించి, ధూపం వేసి..హారతి ఇవ్వండి. కొంత స‌మ‌యం షిర్డీ సాయిబాబా శ్లోకాల‌ను జపించండి.
  • అనంత‌రం గ‌త త‌ప్పుల‌కు క్ష‌మాప‌ణ కోరుతూ.. శాంతి, సంతోషం కోసం నిజ‌మైన భ‌క్తితో పూజ‌లో నిమ‌గ్నమై పోండి.
  • నైవేద్యంగా ల‌డ్డూలు పెట్టండి.
  • సాయంత్రం మరోసారి సాయిబాబా పూజ చేసి ఉపవాసం ముగించండి.
  • గురువారం నాడు మీకు ఉన్నదాంట్లో ఎంత వీలైతే అంత దానం చేయండి.
  • గురువారాల్లో ఈ ఆచారాలను పాటించడం వల్ల సాయిబాబా త్వరగా ప్రసన్నం చేసుకుంటారని, జీవిత కష్టాలు తొలగిపోతాయని భ‌క్తులు నమ్ముతారు.