BREAKING NEWS । జమ్ములోని ఆర్మీ బేస్ క్యాంప్‌పై దాడి?
జమ్ములోని అతిపెద్ద ఆర్మీ బేస్ క్యాంప్ పై సోమవారం ఉదయం దాడి జరిగింది. ఉగ్రవాద కార్యకలాపాల అనుమానంతో ఆ ప్రాంతంలో భారీగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు
BREAKING NEWS । జమ్ములోని అతిపెద్ద ఆర్మీ బేస్ క్యాంప్ పై సోమవారం ఉదయం దాడి జరిగింది. ఉగ్రవాద కార్యకలాపాల అనుమానంతో ఆ ప్రాంతంలో భారీగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఆర్మీ బేస్ క్యాంప్‌నకు సమీపంలో ఉదయం పది నుంచి పదిన్నర గంటల మధ్య కాల్పుల శబ్దం వినిపించిందని లెఫ్టినెంట్ కర్నల్ సునీల్ బర్త్వాల్ చెప్పారు. బయటి ప్రాంతం నుంచి దాడి జరిగినట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో పరిసర ప్రాంతాలను మూసివేశారు. ఇప్పటి వరకు అయితే భారత జవాన్లలో ఎవరికీ ప్రాణ నష్టం లేదని తెలుస్తున్నది. ఒక ఆర్మీ జవాను గాయపడినట్టు తెలుస్తున్నది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.
Further details are awaited.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram