Operation Sindoor | పాక్ కాల్పుల్లో మరో ముగ్గురు జవాన్ల వీర మరణం

  • By: TAAZ |    news |    Published on : May 11, 2025 5:01 PM IST
Operation Sindoor | పాక్ కాల్పుల్లో మరో ముగ్గురు జవాన్ల వీర మరణం

Operation Sindoor | జమ్మూకశ్మీర్ ఆర్ఎస్ పురా సెక్టార్ లో పాక్ కాల్పుల్లో ముగ్గరు జవాన్లు వీరమరణం పొందారు. పాక్ ఆకస్మిక కాల్పుల్లో భారత ఆర్మీ రైఫిల్ మ్యాన్ సునీల్ కుమార్ వీర మరణం పొందారు. సునీల్ కుమార్ స్వస్థలం జమ్మూలోని ట్రెవా గ్రామం. అమర జవాను పార్థివ దేహాన్ని సైనిక అధికారులు ఆయన నివాసానికి చేర్చారు. సునీల్ కుమార్ పార్థీవ దేహాన్ని చూసిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం ప్రభుత్వ, సైనిక లాంఛనాలతో అమర జవాన్ సునీల్ కుమార్ అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల్లో వేలాది సంఖ్యలో ప్రజలు పాల్గొని ఘన నివాళులర్పించారు. ఇదే జమ్మూకాశ్మీర్ ఆర్ఎస్ పురా సెక్టార్‌లో పాకిస్తాన్ కాల్పుల్లో జవాన్ సార్జెంట్ సురేంద్ర మోగా వీరమరణం పొందారు. సురేంద్ర మోగా పార్థీవ దేహాన్ని రాజస్థాన్ రాష్ట్రం ఝుంఝునులోని మాండవా గ్రామంలోని ఆయన నివాసానికి తరలించారు. అటు పాక్ కాల్పుల్లో ఇదే ఆర్ఎస్ పురా సెక్టార్ లో బీఎస్ఎఫ్ అవుట్ పోస్టు ఎస్ఐ ఎండీ.ఇంతియాజ్ కూడా వీర మరణం పొందారు.