వన్డేలు, టీ20లకు కోహ్లీ దీర్ఘకాలిక సెలవు.. మరి కెప్టెన్‌ రోహిత శర్మ ?

వైట్‌బాల్‌ గేమ్‌లకు కొంతకాలం దూరంగా ఉండాలని విరాట్‌కోహ్లీ నిర్ణయించుకున్నాడు.

వన్డేలు, టీ20లకు కోహ్లీ దీర్ఘకాలిక సెలవు.. మరి కెప్టెన్‌ రోహిత శర్మ ?

ప్రపంచకప్‌లో ఘోర పరాభవం అనంతరం భారత బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ సుదీర్ఘ సెలవు పెట్టాడు. తాను కొంతకాలం వైట్‌బాల్‌ వన్డే మ్యాచ్‌లు, టీ20లకు అందుబాటులో ఉండటం లేదని బీసీసీకి సమాచారం ఇచ్చాడు. దీంతో త్వరలో జరుగబోయే దక్షిణాఫ్రికా టూర్‌కు, తదుపరి ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే టీ20 సిరీస్‌కు కోహ్లీ అందుబాటులో ఉండేదే లేదని తేలిపోయింది.


టీ20 సిరీస్‌ జనవరిలో జరగాల్సి ఉన్నది. అయితే.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కూడా దీర్ఘకాలిక సెలవు పెడతాడని వార్తలు వస్తున్నా.. ఇంకా అతను క్లారిటీ ఇవ్వలేదు. అయితే.. రెడ్‌బాల్‌ క్రికెట్‌పై కేంద్రీకరించాలని కోహ్లీ నిర్ణయించుకున్నాడని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. కాబట్టి దక్షిణాఫ్రికాతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు ఆయన అందుబాటులో ఉంటారని తెలుస్తున్నది.


మరోవైపు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ దక్షిణాఫ్రికాతో జరిగే వైట్‌బాట్‌ మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడా? లేదా? అన్న విషయంలో స్పష్టతలేదు. ఆస్ట్రేలియలో జరిగిన 2022 టీ20 ప్రపంచకప్‌ తర్వాతి నుంచి కోహ్లీ, రోహిత్‌శర్మ టీ20 మ్యాచ్‌లలో పాల్గొనలేదు.