Pranay murder case: ప్రణయ్ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు!

ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు వెలువరించి. నిందితుల్లో ఏ 2గా ఉన్న సుభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. కేసులోని మిగతా ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి రోజారమణి తుది తీర్పు వెలువరించారు.

Pranay murder case: ప్రణయ్ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు!

Pranay murder case: ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు వెలువరించి. నిందితుల్లో ఏ 2గా ఉన్న సుభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. కేసులోని మిగతా ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి రోజారమణి తుది తీర్పు వెలువరించారు.

మిర్యాలగూడకు చెందిన మారుతిరావు తన కూతురు అమృత ప్రియుడు ప్రణయ్(ఎస్సీ సామాజిక వర్గం) ని కులాంతర వివాహం చేసుసుకుందన్న నెపంతో సుపారీ గ్యాంగ్‌తో 2018 సెప్టెంబరు 14వ తేదీన ప్రణయ్‌ను హత్య చేయించాడు. గర్బిణీగా ఉన్న అమృతను ప్రణయ్ ఆసుపత్రికి తీసుకవెళ్లిన క్రమంలో ప్రధాన నిందితుడు సుభాష్ శర్మ ఆసుపత్రి వద్ధ మాటు వేశాడు. కత్తితో ప్రణయ్ పై దాడి చేసి హత్య చేశాడు.

ఈ కేసులో ఏ-1 ఉన్న మారుతీరావు 2020లో ఆత్మహత్య చేసుకున్నాడు. అమృత తండ్రి మారుతీ రావు ఉగ్రవాది అస్గర్ అలీకి ప్రణయ్ హత్యకు సుఫారీ ఇచ్చాడు. అస్గర్ అలీ ఏడుగురితో గ్యాంగ్ ను ఏర్పాటు చేశాడు. ఏ 2 సుభాష్ శర్మ, ఏ 3 అస్గర్ అలీ, ఏ 4 అబ్దుల్ బారీ, ఏ5 మహ్మద్ కరీమ్, ఏ 6గా మారుతీరావు తమ్ముడు శ్రవణ్, ఏ 7గా డ్రైవర్ శివ, ఏ 8 ఆటోడ్రైవర్ ఎంఏ నజీంలు ఉన్నారు. ప్రణయ్ హత్య కేసులో ఎస్సీ ఎస్టీ సెషన్స్ రెండో అదనపు న్యాయ స్థానం 102మంది సాక్షులను విచారించి శిక్షలు ఖరారు చేసింది.

అస్గర్ అలీ గతంలో గుజరాత్ హెంశాఖ మంత్రి హీరన్ పాండ్యన్ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఆ కేసులో నిందితులతో కలిసి అస్గర్ అలీ ప్రణయ్ ను హత్య చేసేందుకు గ్యాంగ్ ను ఏర్పాటు చేశాడు. కాగా ప్రణయ్ హత్య కేసులో కోర్టు తీర్పును కుటుంబ సభ్యులు స్వాగతించారు. నిందితులకు విధించిన శిక్షల పట్ల హర్షం వ్యక్తం చేశారు.