Airtel recharge | ఎయిర్‌టెల్ సరికొత్త రీజార్జి ప్లాన్.. ఇక 28 రోజుల ఇబ్బందికి చెక్..!
Airtel recharge | దేశంలోని ప్రముఖ టెలికాం ప్రొవైడర్‌లలో ఒకటైన ఎయిర్‌టెల్ సరికొత్త రిఛార్జి ప్లాన్‌ను పరిచయం చేసింది. నెలవారీ రీచార్జికి సంబంధించి టెలికాం కంపెనీలు సాధారణంగా 28 రోజుల వ్యాలిడిటీనే అందిస్తుంటాయి. అయితే తక్కువ వ్యాలిడిటీతో విసుగుచెందుతున్న కస్టమర్ల కోసం ఎయిర్‌టెల్ 35 రోజుల వ్యాలిడిటీతో కొత్త ప్లాన్‌ను అందుబాటులోకి వచ్చింది.
Airtel recharge : దేశంలోని ప్రముఖ టెలికాం ప్రొవైడర్‌లలో ఒకటైన ఎయిర్‌టెల్ సరికొత్త రిఛార్జి ప్లాన్‌ను పరిచయం చేసింది. నెలవారీ రీచార్జికి సంబంధించి టెలికాం కంపెనీలు సాధారణంగా 28 రోజుల వ్యాలిడిటీనే అందిస్తుంటాయి. అయితే తక్కువ వ్యాలిడిటీతో విసుగుచెందుతున్న కస్టమర్ల కోసం ఎయిర్‌టెల్ 35 రోజుల వ్యాలిడిటీతో కొత్త ప్లాన్‌ను అందుబాటులోకి వచ్చింది.
తక్కువ వ్యవధిలోనే రీచార్జి చేసుకునే సమస్యకు ప్రతిస్పందనగా ఎయిర్‌టెల్ నుంచి తాజా ఆఫర్ వచ్చింది. అంతరాయంలేని సేవల కోసం ప్రతి 28 రోజులకు ఒకసారి రీఛార్జి చేసుకోవాల్సి రావడంవల్ల చాలామంది వినియోగదారులు తరచూ అసౌకర్యానికి గురవుతుంటారు. ఈ సమస్యను గుర్తించి ఎయిర్‌టెల్ 35 రోజులపాటు ఎక్స్టెండెడ్ వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ రీచార్జి ప్లాన్ ధర కేవలం రూ.289 మాత్రమే.
ఎయిర్‌టెల్ కొత్త రీఛార్జ్ ప్లాన్ అధిక వ్యాలిడిటీతోపాటు వినియోగదారులకు అదనపు ప్రయోజనాలను అందిస్తుంది. చెల్లుబాటు వ్యవధిలో అపరిమిత కాలింగ్‌తోపాటు రోజుకు 300 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు చేసుకోవచ్చు. అయితే అధిక డేటా అవసరాలు ఉన్న వినియోగదారులకు ఇది సరైన ఎంపిక కాకపోవచ్చు. ఎందుకంటే మొత్తం చెల్లుబాటు వ్యవధికి 4GB డేటా మాత్రమే ఈ ప్లాన్‌పై లభిస్తుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram