US Supreme Court tariff ruling| సుంకాల పెంపు రద్దు.. ట్రంప్ కు అమెరికా సుప్రీంకోర్టు షాక్ !
ప్రపంచ దేశాలపై అధిక సుంకాలను విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్ననిర్ణయాన్ని ఆ దేశ సుప్రీంకోర్టు తీవ్రంగా వ్యతిరేకించింది. పెంచిన సుంకాలను రద్దు చేస్తున్నట్లుగా తీర్పు వెలువరించింది. ట్రాంప్ టారీఫ్ లకు వ్యతిరేకంగా తొమ్మిది మంది ధర్మాసంన తీర్పు వెలువరించడం సంచలనం రేపింది.
విధాత: ప్రపంచ దేశాలపై అధిక సుంకాలను విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్ననిర్ణయాన్ని ఆ దేశ సుప్రీంకోర్టు తీవ్రంగా వ్యతిరేకించింది. పెంచిన సుంకాలను రద్దు చేస్తున్నట్లుగా తీర్పు వెలువరించింది. ట్రాంప్ టారీఫ్ లకు వ్యతిరేకంగా తొమ్మిది మంది ధర్మాసంన తీర్పు వెలువరించడం సంచలనం రేపింది. ట్రాంప్ టారీఫ్ లను ఆరుగురు జడ్జీలు వ్యతిరేకించగా..ముగ్గురు సమర్థించారు. అసలు అమెరికా అధ్యక్షుడికి సుంకాల పెంపు అధికారం లేదని, కేవలం అత్యవసర సమయంలో మాత్రేమే ఆ అధికారం ఉంటుందని తేల్చింది. ట్రంప్ సుంకాల పెంపు ఇల్లీగల్ అని స్పష్టం చేసింది. వివిధ దేశాలపై భారీ సుంకాలు విధించిన ట్రంప్ చర్య రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తేల్చింది. అంతర్జాతీయ వాణిజ్యంపై ఇలాంటి నిర్ణయాలు తీసుకునే అధికారం అధ్యక్షుడికి ఏకపక్షంగా లేదని వ్యాఖ్యానించింది.
పలు దేశాలపై ట్రంప్ విధించిన సుంకాలు రూ.16 లక్షల కోట్లు తిరిగి చెల్లించాలని కూడా అమెరికా సుప్రీంకోర్టు ఆదేశించడం విశేషం. ట్రంప్ సుంకాల పెంపు నిర్ణయం బాధిత దేశాలతో పాటు అమెరికాకు కూడా ప్రయోజనకరం కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ తీర్పు తక్షణమే అమలులోకి వస్తుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
సుంకాల పెంపుపై అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ట్రంప్ సుంకాల పెంపుతో ఇబ్బంది పడిన దేశాలకు భారీ ఊరటనిచ్చేదిగా ఉంది. భారత్ పై ట్రంప్ 18 శాతం అధిక సుంకాలను విధించిన సంగతి తెలిసిందే. అమెరికా సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే అమెరికా స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో పుంజుకోవడం గమనార్హం. ఈ తీర్పు ప్రపంచ వాణిజ్య విధానాలపై, ముఖ్యంగా అమెరికా భవిష్యత్ వాణిజ్య నిర్ణయాలపై కీలక ప్రభావం చూపనుందని నిపుణులు భావిస్తున్నారు.
నా దగ్గర ప్లాన్ బీ ఉంది. : ట్రంప్
ప్రపంచ దేశాలపై అధిక టారీఫ్ లు విధించడాన్ని అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పుపై అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. నా వద్ద ప్లాన్ బీ ఉందని కామెంట్ చేశారు. అయితే ప్లాన్ బీ ఏమై ఉంటుందన్న ఆసక్తి ఆర్థిక నిపుణుల్లో చర్చనీయాంశమైంది. దేశాల మధ్య జరిగిన ట్రేడ్ డీల్ ట్రంప్ ప్లాన్ బీ అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram