Bank News: వినియోగదారులకు అలర్ట్.. బ్యాక్ టు బ్యాక్ సేవలకు యాక్సిస్ బ్యాంక్ రెడీ

  • By: sr |    business |    Published on : Apr 05, 2025 9:42 AM IST
Bank News: వినియోగదారులకు అలర్ట్.. బ్యాక్ టు బ్యాక్ సేవలకు యాక్సిస్ బ్యాంక్ రెడీ

Bank News | Axis

ముంబై: భారత్‌లోని ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్, భారత్ కనెక్ట్ అనే NBBL సేవలను ఉపయోగించి B2B(బ్యాక్ టు బ్యాక్) సేవలను అందించేందుకు భారతదేశంలోని ఫార్చ్యూన్ 500 సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. దీన్ని అమలు చేసిన తొలి బ్యాంకుగా యాక్సిస్ బ్యాంక్ నిలిచింది. ఇందుకోసం అత్యాధునిక, బలమైన API సాంకేతికతను వినియోగించింది.

ఈ పరిష్కారం FMCG, ఫార్మా, ఆటోమోటివ్, హెల్త్‌కేర్ వంటి వివిధ రంగాల్లోని ఆర్డర్ అప్లికేషన్‌లను ఒకచోట చేర్చి, సంస్థ హోల్‌సేల్ పంపిణీదారులు, స్టాకిస్టుల సేకరణలను సులభతరం చేస్తుంది. రిటైలర్లు నేరుగా అప్లికేషన్ ద్వారా ఇన్‌వాయిస్ చెల్లింపులను ప్రారంభించే వీలుంది. ఈ ప్రత్యేక సేవను అందించే బిల్లర్ ఆపరేటింగ్ యూనిట్‌గా, యాక్సిస్ బ్యాంక్ ఈ సౌలభ్యమైన, వేగవంతమైన, విస్తరణీయ, అనుకూలమైన పరిష్కారాన్ని NBBL భారత్ బిల్‌పే సహకారంతో రూపొందించింది.

డిజిటల్ భారత్ లక్ష్యానికి ఊతం

యాక్సిస్ బ్యాంక్ ట్రెజరీ, మార్కెట్స్ & హోల్‌సేల్ బ్యాంకింగ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ అండ్ హెడ్ నీరజ్ గంభీర్ మాట్లాడుతూ.. “మా క్లయింట్ల కోసం డిజిటల్ చెల్లింపులను, సేకరణలను ప్రారంభించడంలో యాక్సిస్ బ్యాంక్ ఎప్పుడూ ముందుంటుంది. B2B సేకరణ పరిష్కారాన్ని సంస్థతో కలిసి అందించడం మా అత్యుత్తమ కార్పొరేట్ API బ్యాంకింగ్ సాంకేతికతకు దర్పనంగా నిలుస్తోంది. భారతదేశ డిజిటల్ ప్రగతిలో ఈ చర్య ఒక ఆవిష్కరణాత్మక ఉదాహరణ. ఇది కస్టమర్లకు అధిక సౌలభ్యాన్ని, సులభమైన చెల్లింపు అనుభవాన్ని అందిస్తుంది.” అని అన్నారు.

NPCI భారత్ బిల్‌పే లిమిటెడ్ (NBBL) CEO నూపూర్ చతుర్వేది మాట్లాడుతూ.. “భారత్ కనెక్ట్ తన పరిధిని B2B ఇన్‌వాయిస్ చెల్లింపు, ఫైనాన్సింగ్ వేదికగా విస్తరిస్తోంది. పెద్ద సరఫరా గొలుసు, పంపిణీ నెట్‌వర్క్‌లలోని మాన్యువల్ ప్రక్రియలను సరళీకరించడమే దీని లక్ష్యం. యాక్సిస్ బ్యాంక్ ఇందులో చొరవ తీసుకోవడంలో అభినందనీయం. ఇది బ్యాంకుతో మా బలమైన సంబంధాన్ని మరింత బలపరుస్తుంది. చెల్లింపులు, సేకరణల రంగాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో మా సమష్టి నిబద్ధతను ఇది చాటుతుంది” అని పేర్కొన్నారు.