iPhone Offers | ఐఫోన్‌కు మారాలనుకుంటున్నారా..? బంపర్‌ ఆఫర్స్‌ ప్రకటించిన అమెజాన్‌..!

iPhone Offers | స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు అమెజాన్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ప్రస్తుతం వాడుతున్న స్మార్ట్‌ఫోన్‌ స్థానంలో అప్‌డేట్‌ చేసుకోవాలనుకునే వారి కోసం ఆఫర్స్‌ని తీసుకువచ్చింది. ఆపిల్ ఉత్పత్తులపై ఈ కామర్స్‌ దిగ్గం భారీగానే డిస్కౌంట్‌ ఆఫర్స్‌ని ప్రకటించింది. ఐఫోన్‌-13, ఐఫోన్‌ 14, ఐఫోన్‌ 15పై డిస్కౌంట్‌తో పాటు క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌, ఎక్స్‌ఛేంజ్‌ చేసుకునే వీలు కల్పిస్తున్నది.

ఐఫోన్‌-13పై 13శాతం డిస్కౌంట్‌..

అమెజాన్‌ ఐఫోన్ 13పై ప్రస్తుతం 13శాతం డిస్కౌంట్‌ ఇస్తున్నది. డిస్కౌంట్‌ పోతే కేవలం రూ.52,090కే మొబైల్‌ లభించనున్నది. దాంతో పాటు నో కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్‌ సైతం ఉన్నది. నో కాస్ట్ ఈఎంఐతో క్రెడిట్ కార్డు లావాదేవీలపై రూ.2,345.53 వడ్డీ ఆదా కానున్నది. అమెజాన్ లో మరో ఆఫర్ సైతం ఉన్నది. ఎయిర్‌టెల్‌ పోస్ట్‌పెయిడ్‌కు మారితే, అదనంగా రూ.1200 తగ్గింపు లభించనున్నది. వర్కింగ్ కండిషన్‌లో ఉన్న స్మార్ట్ మొబైల్‌ని ఎక్స్ఛేంజ్‌ చేస్తే రూ.33,400 వరకు డిస్కౌంట్ లభించనున్నది. అయితే, మొబైల్‌ మోడల్‌ను బట్టి ధర ఆధారపడి ఉంటుంది. ఇక ఐఫోన్‌ 13 లో 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌ఆర్‌డీ డిస్‌ప్లే, అడ్వాన్స్‌డ్‌ డ్యూయల్ కెమెరా సిస్టమ్, శక్తివంతమైన ఏ15 బయోనిక్ చిప్‌ సెట్‌ ఉంటుంది.

రూ.62వేలకే ఐఫోన్ 14

ఐఫోన్ 14 మొబైల్‌ని అమెజాన్‌ ప్రస్తుతం రూ.62,800కే అందిస్తున్నది. వాస్తవానికి ఈ మొబైల్‌ ధర రూ.69,900గా ఉన్నది. డిస్కౌంట్‌తో రూ.62,800కే వస్తున్నది. బ్యాంక్ ఆఫర్స్‌తో కలిపి అదనంగా రూ.3వేల వరకు తగ్గింపు పొందవచ్చు. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్ సైతం అందుబాటులో ఉన్నాయి. క్రెడిట్‌కార్డులపై ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ లభించనున్నది. ఐఫోన్ 14లో 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌ఆర్‌డీ డిస్‌ప్లే, అడ్వాన్స్‌డ్‌ కెమెరా సిస్టమ్‌, క్రాష్ డిటెక్షన్ టెక్నాలజీ ఉండగా.. సిరామిక్ షీల్డ్, వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్స్‌తో వస్తుంది.

ఐఫోన్ 15పై 9శాతం డిస్కౌంట్‌

ఇక ఐఫోన్‌ 15పై అమెజాన్‌ 9శాతం డిస్కౌంట్‌ ఇస్తున్నది. ఈ మొబైల్‌ ధర రూ.79,900. ఎస్‌బీఐతో పాటు పలు బ్యాంకుల కార్డుల కొనుగోలుపై రూ.6వేల అదనంగా ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ లభించనున్నది. అంతేకాదు, నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ అందుబాటులో ఉంది. దాంతో రూ.3,291.62 వరకు ఈఎంఐపై వడ్డీ ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. ఐ ఫోన్ 15 డైనమిక్ ఐలాండ్ ఫీచర్‌, 16.1 ఇంచెస్‌ సూపర్‌ రెటినా ఎక్స్‌డీఆర్‌ డిస్‌ప్లేతో వస్తుంది. ఏ 16 బయోనిక్‌ ప్రాసెసర్‌తో వస్తుంది.