Amazon Prime Day Sale | ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఈ ఏడాది ప్రైమ్ డే సేల్స్ డేట్స్‌ను విడుదల చేసింది. ఈ నెల 20 నుంచి 21 వరకు సేల్స్ కొనసాగుతాయని పేర్కొంది. అయితే, ప్రైమ్ డే సేల్ సందర్భంగా డీల్స్‌పై ఎలాంటి ప్రకటన చేయలేదు.
Amazon Prime Day Sale | ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఈ ఏడాది ప్రైమ్ డే సేల్స్ డేట్స్‌ను విడుదల చేసింది. ఈ నెల 20 నుంచి 21 వరకు సేల్స్ కొనసాగుతాయని పేర్కొంది. అయితే, ప్రైమ్ డే సేల్ సందర్భంగా డీల్స్‌పై ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, టీవీలు, ల్యాప్టాప్స్, స్మార్ట్‌ఫోన్స్, ఫ్యాషన్, ఫుడ్‌తో పాటు రోజువారీ నిత్యవసరాలపై భారీగానే డీల్స్ ఉంటాయని పేర్కొంది. ప్రైమ్‌డే సేల్ జూలై 20న అర్ధరాత్రి 12 గంటలకు మొదలై 21న రాత్రి 11.59 గంటలకు ముగియనున్నది. వన్ ప్లస్, శాంసంగ్, హానర్, ఐక్యూ, బజాజ్, మోటరోలా తదితర బ్రాండ్లకు చెందిన 450 ఉత్పత్తులు కొత్తగా లాంచ్ చేయనున్నట్లు పేర్కొంది. లాంచ్ చేయబోయే కొత్త ఉత్పత్తుల పేర్లను అమెజాన్ ప్రకటించలేదు. అయితే, హానర్ 200 సిరీస్, మోటరోలా రేజర్ 50 సిరీస్, వన్ ప్లస్ నార్డ్-4 లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది.
ఇక ఈ సేల్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్‌కార్డులు, ఎస్బీ క్రెడిట్‌కార్డ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్‌పై 10శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్‌ను ఇవ్వబోతున్నది. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ కార్డు వినియోగదారులకు అదనంగా 5శాతం డిస్కౌంట్ లభించనున్నది. అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు ఇప్పటికే ప్రైమ్ మెంబర్స్ 5శాతం, నాన్ ప్రైమ్ మెంబర్స్ 3 శాతం క్యాష్ బ్యాక్ వస్తున్నది. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటే ప్రైమ్ మెంబర్లకు రూ.300 క్యాష్ బ్యాక్, రూ.2,200 విలువైన రివార్డులు లభిస్తాయని తెలిపింది. నాన్ ప్రైమ్ మెంబర్లకు రూ.200 క్యాష్ బ్యాక్, రూ.1,800 విలువైన రివార్డులు, 3 నెలల ప్రైమ్ మెంబర్ ఇవ్వనున్నట్లు వివరించింది.