Womens: మహిళల కోసం కొత్త పథకం..

జీవిత బీమా సంస్థల్లో ఒకటైన బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందిన బజాజ్ అలయంజ్ లైఫ్ సూపర్‌ఉమన్ టర్మ్ (ఎస్‌డబ్ల్యూటీ) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం సంప్రదాయ జీవిత బీమా పరిధిని మించి, టర్మ్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలతో పాటు మహిళలకు ప్రత్యేకమైన క్రిటికల్ ఇల్‌నెస్ బెనిఫిట్స్, ఐచ్ఛిక చైల్డ్ కేర్ బెనిఫిట్, హెల్త్ మేనేజ్‌మెంట్ సేవలను అందిస్తూ ఆర్థిక భద్రతను కల్పిస్తుందని ఆ సంస్థ చెబుతోంది. మహిళలు, వారి కుటుంబాలకు సంపూర్ణ రక్షణను నిర్ధారిస్తూ వారి ఆర్థిక స్వతంత్రతను బలోపేతం చేస్తుందని తెలిపింది. మహిళలు కుటుంబ సంరక్షణలో కీలక పాత్ర వహిస్తారు. వారి ఆర్థిక భద్రతను పటిష్టం చేయడం ద్వారా జీవిత లక్ష్యాలను సాధించడంలో సూపర్‌ఉమన్ టర్మ్ పథకం తోడ్పడుతుంది. ఈ పథకం ఆర్థిక ఆత్మవిశ్వాసం, జీవితంలో ప్రతి దశలో స్థిరత్వాన్ని అందిస్తుంది.
ఈ పథకంలోని ప్రధాన అంశాలు:
సమగ్ర ఆర్థిక భద్రత: మహిళల అభివృద్ధి చెందుతున్న పాత్ర, వారి ఆర్థిక అవసరాలకు అనుగుణంగా ఈ పథకం రూపొందింది. పాలసీదారు మరణించిన సందర్భంలో నామినీకి ఏకమొత్తం క్లెయిమ్‌ను చెల్లిస్తూ వారిపై ఆధారపడిన వారి భవిష్యత్తును రక్షిస్తుంది. క్రిటికల్ ఇల్‌నెస్ కవరేజీ: బ్రెస్ట్, సర్విక్స్, ఒవేరియన్ క్యాన్సర్‌లతో సహా 60 క్రిటికల్ అనారోగ్యాలకు ఈ పథకం రక్షణ కల్పిస్తుంది.
చైల్డ్ కేర్ బెనిఫిట్: పిల్లల భవిష్యత్తును సురక్షితం చేయడానికి ఈ పథకం ఐచ్ఛిక చైల్డ్ కేర్ బెనిఫిట్‌ను అందిస్తుంది. దురదృష్టకర సంఘటనల్లో కూడా పిల్లల చదువు, ఇతర అవసరాల కోసం నెలవారీ స్థిర ఆదాయాన్ని నిర్ధారిస్తుంది.
హెల్త్ మేనేజ్‌మెంట్ సేవలు: సంపూర్ణ హెల్త్ చెకప్‌లు, ఓపీడీ కన్సల్టేషన్లు, గర్భం సంబంధిత తోడ్పాటు, ఎమోషనల్ వెల్‌నెస్ కార్యక్రమాలు, న్యూట్రిషనిస్ట్ మార్గదర్శనం వంటి సేవలను ఈ పథకం ఉచితంగా అందిస్తుంది.
“మహిళలు తమ ఆరోగ్యం, పిల్లల సంక్షేమం, ఆర్థిక స్వతంత్రతకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ అంశాలన్నింటినీ ఒకే పథకంలో అందించేలా సూపర్‌ఉమన్ టర్మ్‌ను రూపొందించాం. మహిళలు తమ లక్ష్యాలను సాధించేందుకు ఆర్థిక భరోసాతో సాధికారత పొందేలా ఈ పథకం వారి ఆరోగ్య, కుటుంబ అవసరాలకు అనుగుణంగా కస్టమైజ్ చేయవచ్చు” అని బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ & సీఈవో తరుణ్ చుగ్ పేర్కొన్నారు.