Personal Finance | అప్పులు ఎక్కువయ్యాయని ఆత్మహత్యలు వద్దు.. ఈ ఐదు పనులు చేయండి..!
Personal Finance | అప్పుల( Debt ) బాధతో ఆత్మహత్య( Suicide ) చేసుకుని ఈ ప్రపంచానికి వీడ్కోలు పలికిన వారు ఈ భూమ్మీద చాలా మందే ఉన్నారు. అయితే అప్పుల భారం నుంచి బయటపడటానికి ఆత్మహత్య పరిష్కారం కాదు. క్షణికావేశాలకు లోను కాకుండా.. కాస్త నెమ్మదిగా ఆలోచిస్తే.. అప్పుల నుంచి బయటపడొచ్చు. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

Personal Finance | బంగారు మేడలో నివసించే కోటీశ్వరుడి నుంచి మొదలుకుంటే పూరి గుడిసెలో నివసించే పేదోడి( Poor Man ) వరకు అందరూ అప్పులు( Debts ) చేస్తుంటారు. అప్పు లేని వాడు ఈ భూమ్మీద ఉండనే ఉండడు. అంటే ఏదో ఒక రూపంలో ప్రతి ఒక్కరూ అప్పులు చేస్తుంటారని. కొందరు బ్యాంకుల( Banks ) ద్వారా అప్పులు తీసుకుంటే.. మరికొందరు వడ్డీ వ్యాపారుల నుంచి, ఇంకొందరు ఫైనాన్స్( Finance ), క్రెడిట్ కార్డుల( Credit Cards ) ద్వారా అప్పులు తీసుకుంటారు. ఇక భారీ స్థాయిలో అప్పులు అయిన తర్వాత తిరిగి చెల్లించడం కష్టమవుతుంది. ఎందుకంటే అప్పులకు తగ్గ ఆదాయం( Income ) లేకపోవడమే. ఆదాయం లేకపోవడం.. అప్పులు చెల్లించని స్థితిలో ఆత్మహత్యలే పరిష్కారమని చాలా మంది భావిస్తారు. క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటారు. చేసుకున్నవారు కూడా చాలా మందే ఉన్నారు. అయితే అప్పులు ఎక్కువయ్యాయని ఆత్మహత్యలు చేసుకోవడం పరిష్కారం కాదు. కాస్త తెలివిగా ఆలోచిస్తే.. అప్పుల నుంచి ఉపశమనం పొందొచ్చు. మరి ఉపశమనం పొందే ఆ పనులు ఏంటో తెలుసుకుందాం..
మీరు అప్పు తిరిగి చెల్లించలేని పరిస్థితిలో ఈ ఐదు పనులు చేయండి..
బ్యాంకు అధికారులతో మాట్లాడండి..
మీరు అప్పు తిరిగి చెల్లించే పరిస్థితిలో లేకపోతే.. ఏ బ్యాంకు నుంచి రుణం తీసుకున్నామో.. ఆ బ్యాంకును సంప్రదించండి. బ్యాంకు అధికారులను నేరుగా కలవలేని పరిస్థితి ఉంటే.. సదరు బ్యాంక్‌కు ఈమెయిల్ చేయండి. వీలైతే, మీరు రుణం తీసుకున్న బ్రాంచ్‌ను సందర్శించి, రుణ విభాగ అధికారిని కలవండి. మీరు ఆ అధికారిని కలిస్తే, మీ సమస్యను అతనికి లిఖితపూర్వకంగా చెప్పండి, తద్వారా మీరు మీ పరిస్థితి గురించి బ్యాంకుకు తెలియజేసినట్లు మీకు రుజువు ఉంటుంది.
కొంతకాలం ఈఎంఐ నుంచి ఉపశమనం..
బ్యాంకు అధికారులతో మాట్లాడి.. ఎంతకాలం ఈఎంఐ చెల్లించలేరో స్పష్టంగా చెప్పండి. దీంతో కొంతకాలం ఈఎంఐ నుంచి ఉపశమనం పొందొచ్చు. మీరు అడిగే సమయాన్ని బట్టి.. మీ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, మీకు సమయం ఇవ్వాలా వద్దా అని బ్యాంక్ నిర్ణయిస్తుంది. ఎక్కువ సమయం ఉంటే, మీరు అప్పులు తిరిగి చెల్లించేందుకు అనేక రకాల మార్గాలను అన్వేషిస్తారు. ఇది మిమ్మల్ని అప్పుల ఊబి నుంచి బయటపడేసేందుకు మార్గదర్శకం అవుతుంది.
అప్పును పునర్నిర్మించుకోండి..
మీ దగ్గర ఈఎంఐ చెల్లించడానికి సరిపడ డబ్బు లేకపోతే.. బ్యాంకు అధికారులతో మాట్లాడి రుణాన్ని పునర్నిర్మించుకోవచ్చు. దీనిలో రుణం యొక్క ఈఎంఐ తగ్గుతుంది కానీ రుణ తిరిగి చెల్లించే కాలం పెరుగుతుంది.
బ్యాలెన్స్ బదిలీ చేసుకోండి
చాలా బ్యాంకులు రుణ మొత్తంలో బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ (BT) సౌకర్యాన్ని కూడా అందిస్తాయి. అటువంటి పరిస్థితిలో, బ్యాంకులు రుణం రూపంలో ఎక్కువ డబ్బు ఇవ్వడానికి ముందుకొస్తాయి. దీనితో పాత రుణం ముగిసి కొత్త రుణం ప్రారంభమవుతుంది. అలాగే, రుణం తీసుకున్న వ్యక్తికి ఎక్కువ డబ్బు లభిస్తుంది, దానిని అతను తన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి ఉపయోగించవచ్చు.
రుణ పరిష్కారం చేసుకోండి
రుణం తీసుకున్న వ్యక్తి పూర్తి రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించలేనప్పుడు లేదా అతని వద్ద ఎక్కువ డబ్బు లేనప్పుడు రుణం తిరిగి చెల్లించడానికి ఈ ప్రక్రియను అవలంబించాలి. అయితే, రుణం తీసుకున్న వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకోవాలా వద్దా అనేది బ్యాంకుపై కూడా ఆధారపడి ఉంటుంది. పరిష్కారంలో, బ్యాంకులు మిగిలిన మొత్తం రుణ మొత్తాన్ని తీసుకోవు, కానీ దానిలో 10 నుండి 50 శాతం మాత్రమే తీసుకొని మిగిలిన మొత్తాన్ని మాఫీ చేస్తాయి.