Gold Rates | మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు..! హైదరాబాద్‌లో నేటి ధరలు ఇవే..!

Gold Rates | కేంద్రం బడ్జెట్‌ అనంతరం నేలచూపులు చూసిన బంగారం ధరలు.. మళ్లీ పైపైకి కదులుతున్నాయి. ఇటీవల భారీగా పెరిగిన ధరలు ఆదివారం బులియన్‌ మార్కెట్‌లో స్థిరంగా కొనసాగుతున్నాయి.

Reported by: Mallanna | వాణిజ్యం | Aug 04, 2024, 11:26 am IST
Read Time: 3 mins
Gold Rates | మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు..! హైదరాబాద్‌లో నేటి ధరలు ఇవే..!

Gold Rates | కేంద్రం బడ్జెట్‌ అనంతరం నేలచూపులు చూసిన బంగారం ధరలు.. మళ్లీ పైపైకి కదులుతున్నాయి. ఇటీవల భారీగా పెరిగిన ధరలు ఆదివారం బులియన్‌ మార్కెట్‌లో స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం తులానికి రూ.64,700 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.70,580 పలుకుతున్నది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో పసిడి 22 క్యారెట్ల తులానికి రూ.64,500 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.70,360 వద్ద స్థిరంగా ఉన్నది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.64,850 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.70,730 వద్ద స్థిరంగా ఉన్నది. ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.64,700 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.70,580 వద్ద కొనసాగుతున్నది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.64,700 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.70,580కి చేరింది.

ఏపీలోని తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి ధర భారీగా పెరిగింది. మరో వైపు వెండి ధర సైతం నిలకడగా కొనసాగుతున్నది. దేశ రాజధాని ఢిల్లీఓల కిలో ధర రూ.రూ.85,500 పలుకుతున్నది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.90,700 వద్ద కొనసాగుతున్నది. అయితే, బంగారం, వెండి ధరలు రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి. ఆయా రాష్ట్రాల్లోని పన్నుల ఆధారంగా ధర మారుతూ వస్తుంది. మరో వైపు ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.