Gold Price | స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..?
Gold Price | అంతర్జాతీయ మహిళా దినోత్సవం( International Women's Day ) సందర్భంగా.. మహిళలకు ఏదైనా కానుకగా ఇవ్వాలనుకుంటున్నారా..? అయితే ఇంకెందుకు ఆలస్యం.. బంగారం ధరలు( Gold Price ) స్వల్పంగా తగ్గాయి. నచ్చిన వారికి మీ శక్తిమేర బంగారం కొనిచ్చి.. ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేను జీవితాంతం గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేసుకోండి.

Gold Price | ప్రతి రోజు బంగారం ధరల్లో( Gold Price ) మార్పులు చోటు చేసుకుంటుంటాయి. ఏ రోజుకు ఆ రోజు బంగారం( Gold ) ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. గత రెండు రోజుల నుంచి పసిడి ధరలు స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. గురువారం 10 గ్రాముల బంగారం ధర రూ.88,920ఉండగా, శుక్రవారం నాటికి రూ.320 తగ్గి రూ.88,600కు చేరుకుంది. తాజాగా శనివారం(మార్చి 8) ఆ ధర కాస్త తగ్గింది. తులం బంగారం ధర రూ. 87,150కి తగ్గింది.
ఇక వెండి( Silver ) ధర విషయానికి వస్తే.. గురువారం కిలో వెండి ధర రూ.99,789 ఉండగా, శుక్రవారం నాటికి రూ.75 తగ్గి రూ.99,714కు చేరుకుంది. తాజాగా మర్చి 8న అంటే శనివారం నాడు కిలో వెండి ధర రూ.99,200 వద్ద ఉంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,890 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,150 వద్ద ఉంది.
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,890 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,150 వద్ద ఉంది.
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,040 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,300 వద్ద ఉంది.
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,890 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,150 వద్ద ఉంది.
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,890 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,150 వద్ద ఉంది.
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,890 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,150 వద్ద ఉంది.
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,890 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,150 వద్ద ఉంది.