silver, gold all time high| బంగారం, వెండి ధరల ఆల్ టైమ్ రికార్డు..ఒకే రోజు భారీగా పెంపు
బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరిగి.. ఆల్ టైమ్ రికార్డు పెరుగుదలను నమోదు చేశాయి. గురువారం తులం బంగారం ధర ఒక్క రోజునే రూ.11,770పెరిగిపోగా, కిలో వెండి ధర రూ.25,000పెరిగి ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి.
విధాత, హైదరాబాద్ : బంగారం, వెండి ధరలు పెరుగుదల తీరు కొనుగోలుదారులకు షాక్ ఇస్తుంది. ఒకే రోజు పోటాపోటీగా బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోయి ఆల్ టైమ్ రికార్డు పెరుగుదలను నమోదు చేశాయి. గురువారం తులం బంగారం ధర ఒక్క రోజునే రూ.11,770పెరిగిపోగా, కిలో వెండి ధర రూ.25,000పెరిగి ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి.
24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.11770పెరిగి.. రూ.178,850కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.163,950కి కొనసాగుతుంది. జనవరి 1న రూ.1,35,060గా ఉన్న తులం బంగారం ధర నెల రోజుల వ్యవధిలోనే రూ.43,790పెరుగడం గమనార్హం.
దూసుకపోతున్న వెండి ధరలు
వెండి ధరలు కూడా మరోసారి పెరిగాయి. గురువారం కిలో వెండి ధర రూ.25,000పెరిగి రూ.4,25,000కు చేరింది.గత ఏడాది 188శాతం పెరుగుదల నమోదు చేసిన వెండి ధరలు ఈ ఏడాది ఇప్పటివరకు 60 శాతం కంటే ఎక్కువ లాభాన్ని నమోదు చేశాయి. కొద్ది రోజుల్లోనే కిలో వెండి ధర రూ.5లక్షల మార్కును, బంగారం తులం రూ.2లక్షల మార్కును అధిగమించనుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
అమెరికా డాలర్ క్రమంగా బలహీనపడటం, సావరిన్ బాండ్లపై నమ్మకం తగ్గడం, అలాగే ప్రధాన కరెన్సీల నుంచి పెట్టుబడిదారులు బయటకు రావడం వంటి కారణాలతో బంగారం ధర చరిత్రలో ఎన్నడూ లేనంత పైకి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు 5,500 డాలర్ల స్థాయిని దాటుతూ కొత్త రికార్డును నెలకొల్పింది.భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలు, పారిశ్రామిక అవసరాలు, లోహాలను పెట్టుబడి, లాభార్జన మార్గంగా చూడటంతో మునుముందు కూడా బంగారం, వెండి ధరలు పెరుగుతాయని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram