silver, gold price hike| వెండి, బంగారం ధరల పరుగు..10వేలు పెరిగిన వెండి
భారత్ లో రిపబ్లిక్ దినోత్సవం జనవరి 26 సోమవారం రోజున వెండి, బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డును నమోదు చేశాయి. కిలో వెండి ధర రూ.10,000పెరిగి రూ.3,75,000కు చేరింది. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.24,50పెరిగి..రూ.1,62,710కి చేరింది.
విధాత: వెండి, బంగారం ధరలు పరుగు పెడుతున్నాయి. భారత్ లో రిపబ్లిక్ దినోత్సవం జనవరి 26 సోమవారం రోజున వెండి, బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డును నమోదు చేశాయి. ముఖ్యంగా వెండి ధర మరోసారి కొత్త రికార్డును అందుకుంది. కిలో వెండి ధర రూ.10,000పెరిగి రూ.3,75,000కు చేరింది.
కిలో వెండి ధర జనవరి 1న రూ.2,56,000 ఉండగా..25 రోజుల వ్యవధిలోనే రూ.1లక్ష 19,000పెరుగడం గమనార్హం. వెండి ధరల జోరు చూస్తుంటే మరికొన్ని రోజుల్లోనే రూ.4లక్షల మార్కు దాటనుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
బంగారం ధర మరింత పైకి..
వెండి ధరలతో పోటీ పడుతున్నట్లుగా బంగారం ధర మరింత పెరిగింది.
24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.24,50పెరిగి..రూ.1,62,710కి చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.2,250 పెరిగి..రూ.1,49,150కి పెరిగింది.
అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు మునుముందు మరింత పెరుగవచ్చని, త్వరలోనే రూ.2లక్షల మార్కును టచ్ చేయనుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram