స్థిరంగా బంగారం…తగ్గిన వెండి ధరలు

గురువారం హైదరాబాద్ నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,100 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,38,500 పలుకుతోంది. కిలో వెండి ధర మాత్రం మరోసారి రూ. 5,000 తగ్గి రూ, 2,70,000వద్ద కొనసాగుతుంది.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో బులియన్ మార్కెట్లో పసిడి ధరలు కూడా కాస్త శాంతించాయి. గత కొన్ని రోజులుగా హెచ్చు తగ్గులకు గురవుతున్న బంగారం ధరలు నేడు బులియన్ మార్కెట్ లో స్థిరంగా నిలిచాయి. గురువారం హైదరాబాద్ నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,100 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,38,500 పలుకుతోంది. కిలో వెండి ధర మాత్రం మరోసారి రూ. 5,000 తగ్గి రూ, 2,70,000వద్ద కొనసాగుతుంది.

ప్రస్తుత ధరలతో కొనుగోలు మేలు

అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన మధ్యంతర శాంతి ఒప్పందం, వ్యూహాత్మక హార్ముజ్ జలసంధి పునఃప్రారంభం కానుండటంతో మార్కెట్ల దృష్టి ఒక్కసారిగా యుద్ధ భయాల నుండి ఆర్థిక అంశాల వైపు మళ్లింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సడలడంతో ముడి చమురు ధరలు, ద్రవ్యోల్బణ అంచనాలు తగ్గుముఖం పట్టాయి. ఇది యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత కఠినతరం చేస్తుందనే భయాలను తగ్గించింది. ఫలితంగా, అమెరికా ట్రెజరీ దిగుబడులు, డాలర్ ఇండెక్స్ బలహీనపడటం బులియన్‌కు సానుకూలంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్సుకు $4,000 మద్దతు స్థాయిని పరీక్షించిన అనంతరం తిరిగి కోలుకుని విజయవంతంగా $4,300 మార్కును దాటింది. ద్రవ్యోల్బణం అదుపులో ఉండి, ఆర్థిక వృద్ధి సాధారణంగా సాగినంత కాలం బంగారం డిమాండ్ లో దీర్ఘకాలిక లాభాల ధోరణి కొనసాగుతుందని, ధరల్లో వచ్చే ఏవైనా స్వల్పకాలిక తగ్గుదలలు వ్యూహాత్మక కొనుగోళ్లకు మంచి అవకాశాలుగా మారుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకే ప్రస్తుత ధరలు పసిడి కొనుగోలుకు అనుకూలమని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇక వెండి విషయానికి వస్తే.. ఇటీవల ధరల్లో తీవ్రమైన అస్థిరత కనిపించినప్పటికీ ప్రాథమికంగా వెండికి అంతర్జాతీయంగా డిమాండ్ బలంగానే ఉంది. 2026 ఆర్థిక సంవత్సరంలో వరుసగా ఆరవ ఏడాది కూడా వెండికి అంతర్జాతీయంగా సరఫరా కొరత ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో వెండి ధరలు కూడా భవిష్యత్తులో పుంజుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Latest News