Gold Rate | బంగారం ధరలు సామాన్యులకు స్వల్ప ఊరటనిచ్చాయి. నిన్న స్వల్పంగా తగ్గిన ధరలు ఆదివారం బులియన్ మార్కెట్లో నిలకడగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల గోల్డ్ రూ.66,500 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.72,550 వద్ద స్థిరంగా కొనసాగుతున్నది.
Gold Rate | బంగారం ధరలు సామాన్యులకు స్వల్ప ఊరటనిచ్చాయి. నిన్న స్వల్పంగా తగ్గిన ధరలు ఆదివారం బులియన్ మార్కెట్లో నిలకడగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల గోల్డ్ రూ.66,500 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.72,550 వద్ద స్థిరంగా కొనసాగుతున్నది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.67,800 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.73,960 వద్ద కొనసాగుతున్నాయి. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.66,500 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.72,550 వద్ద నిలకడగా ఉన్నది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.66,650 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.72,700 వద్ద ట్రేడవుతున్నది.
హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.66,500 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.72,550 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో వెండి సైతం నిలకడగా ఉన్నది. హైదరాబాద్లో కిలో ధర రూ.89వేలు ధర పలుకుతున్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.