Gold Silver Price Drop | మళ్లీ భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు వారం రోజులుగా భారీ హెచ్చుతగ్గులకు గురవుతున్న క్రమంలో గురువారం మరోసారి భారీగా తగ్గాయి. గురువారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.5,020 తగ్గి.. రూ.1,54,420వద్ద కొనసాగుతుంది. కిలో వెండి ధర మరోసారి రూ. 20,000తగ్గి.. రూ. 3,00000 లకు పడిపోయింది.

Reported by: Y.V. Narsimha Reddy | వాణిజ్యం | Feb 05, 2026, 12:46 pm IST
Read Time: 3 mins
Gold Silver Price Drop | మళ్లీ భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

విధాత, హైదరాబాద్ : బంగారం, వెండి ధరల అస్థిరత కొనసాగుతుంది. భారీగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న బంగారం, వెండి ధరలతో కొనుగోలుదారులు గందరగోళానికి గురవుతున్నారు. గురువారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.5,020 తగ్గి.. రూ.1,54,420వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 4,600 తగ్గి రూ.1,41,550వద్ద నిలిచింది.

మరోసారి రూ.20వేలు తగ్గిన కిలో వెండి ధర

వెండి ధరలు వారం రోజులుగా భారీ హెచ్చుతగ్గులకు గురవుతున్న క్రమంలో గురువారం బులియన్ మార్కెట్ లో కిలో వెండి ధర మరోసారి రూ. 20,000తగ్గి.. రూ. 3,00000 లకు పడిపోయింది. 6రోజుల్లో వెండి ధరలు 4సార్లు భారీగా పతనమయ్యాయి. జనవరి 29న కిలో వెండి ధర ఆల్ టైమ్ రికార్డు రూ.4,25,000నమోదు చేసింది. అప్పటి నుంచి పడుతూ.. లేస్తూ కొనుగోలుదారులను వెండి గందరగోళానికి గురి చేస్తుంది.

బంగారం, వెండి ధరల మార్కెట్ పరిస్థితులపై పృథ్వీఫిన్‌మార్ట్ కమోడిటీ రీసెర్చ్ విశ్లేషకుడు మనోజ్ కుమార్ జైన్ స్పందిస్తూ.. డాలర్ ఇండెక్స్‌లో కొనసాగుతున్న అస్థిరత, అమెరికాలో పాక్షిక ప్రభుత్వ షట్‌డౌన్ పరిస్థితులు, అలాగే భౌగోళిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ వారం బంగారం, వెండి ధరలు ఊగిసలాట కొనసాగే అవకాశం ఉందని అంచనా వేశారు.