మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు

బుధవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 770 తగ్గి రూ.1,44,490కు చేరింది. రూ.700 తగ్గి రూ.1,32,450కు పడిపోయింది. కిలో వెండి ధర సైతం మరోసారి రూ. 5,000 తగ్గి రూ. 2,45,000వద్ద కొనసాగుతుంది.

పశ్చిమాసియాలో ఇరాన్-అమెరికాల మధ్య మరోసారి చెలరేగిన యుద్ద ఉద్రిక్తతలు..అంతర్జాతీయ ఆర్థిక,భౌగోళిక పరిణామాల క్రమంలో బంగారం, వెండి ధరలు మరోసారి పతనమయ్యాయి. బుధవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 770 తగ్గి రూ.1,44,490కు చేరింది. రూ.700 తగ్గి రూ.1,32,450కు పడిపోయింది. కిలో వెండి ధర సైతం మరోసారి రూ. 5,000 తగ్గి రూ. 2,45,000వద్ద కొనసాగుతుంది.

పతనం తాత్కాలికమే…

ఈ మధ్య కాలంలో బంగారం ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. కొన్ని రోజులు వరుసగా పెరిగిన ధరలు, ప్రస్తుతం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అమెరికా డాలర్ బలపడటం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై మార్కెట్ అంచనాలు, పెట్టుబడిదారుల ప్రాఫిట్ బుకింగ్ వంటి అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు భారీగా చేయడం వంటి పరిణామాలు సిడికి దీర్ఘకాలిక మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్వల్పకాలంలో ధరలు ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంది.

అయితే అమెరికా ద్రవ్య సడలింపు అంచనాలు, తగ్గుతున్న ద్రవ్యోల్బణం, యూఎస్ వడ్డీ రేట్ల పెంపు అవకాశాలు తగ్గడం వంటి సానుకూల అంశాలు బంగారం ధరలకు బలమైన మద్దతునిస్తాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.  బంగారంతో పోలిస్తే వెండి ధరలు మరింత పుంజుకోవచ్చంటున్నారు.బంగారం-వెండి నిష్పత్తి ఇటీవలి గరిష్ట స్థాయిల నుండి వెనక్కి తగ్గడం, అలాగే పరిశ్రమల నుండి డిమాండ్ మెరుగుపడుతుండటంతో వెండి ధరలు జూలై నెలలో ఔన్సుకు 68 డాలర్ల మార్కుకు చేరే అవకాశం ఉందన్నారు.

Latest News