దిగొచ్చిన బంగారం, వెండి ధరలు

ఆదివారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,56,930వద్ద నిలిచింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,43,850కి చేరింది. కిలో వెండి ధర రూ. 2,90,000వద్ద కొనసాగుతుంది.

దిగొచ్చిన బంగారం, వెండి ధరలు

విధాత, హైదరాబాద్ : పశ్చిమాసియా యుద్ద సంక్షోభంతో అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, ఆర్థిక పరిణామాలు బంగారం, వెండి ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భారత్ లో పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలు పెరుగుతు పోతుండటం…అంతర్జాతీయ ఒత్తిళ్లతో పాటు కేంద్రం విధించిన ఆంక్షల ప్రభావంతో బంగారం, వెండి ధరలు భారీ కుదుపుకు లోనవుతున్నాయి.

ఆదివారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,56,930వద్ద నిలిచింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,43,850కి చేరింది. కిలో వెండి ధర రూ. 2,90,000వద్ద కొనసాగుతుంది.

బంగారం, వెండి ధరల ఈ ఆకస్మిక పతనానికి అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాలు, ఆర్థిక గణాంకాలు ప్రధాన కారణాలుగా నిలిచాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతుండటం, అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిపోతుండటంతో..విలువైన లోహాలు బంగారం, వెండిపై కూడా దాని ప్రభావం పడుతుంది. ఈ పరిణామాల వల్ల ముడి చమురు ధరలు పెరిగి, అమెరికాలో ద్రవ్యోల్బణం గత నాలుగేళ్లలో ఎన్నడూ లేని స్థాయికి చేరుకుంది. పెరిగిన ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించకపోవడం, డాలర్ రేటులో మార్పులు బంగారం, వెండి ధరల హెచ్చుతగ్గులకు కారణం అవుతున్నాయి.