స్థిరంగా బంగారం, వెండి ధరలు

ఆదివారం బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ. రూ.1,46,080 లు కాగా, 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,33,900గా ఉంది. కిలో వెండి ధర రూ. 2,55,000వద్ద కొనసాగుతుంది.

విధాత, హైదరాబాద్ : ఇరాన్ మళ్లీ హర్మూజ్ జలసంధిని మూసివేయాలని నిర్ణయించిన నేపథ్యంతో మరోసారి పశ్చిమాసియా సంక్షోభ జ్వాలలు ప్రజ్వరిల్లడం అంతర్జాతీయంగా భౌగోళిక, ఆర్థిక అస్థిరతను పెంచింది. పశ్చిమాసియా పరిస్థితులు, అమెరికా భౌగోళిక, ఆర్థిక నిర్ణయాలు బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా బంగారం, వెండి ధరలు సైతం మార్పులకు లోనవుతున్నాయి.

అయితే ఆదివారం బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ. రూ.1,46,080 లు కాగా, 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,33,900గా ఉంది. కిలో వెండి ధర రూ. 2,55,000వద్ద కొనసాగుతుంది.

బంగారం ధరలపై భిన్న అంచనాలు

పశ్చిమాసియా సంక్షోభం మళ్లీ చెలరేగడం, అమెరికా ఫెడరల్ వడ్డీ రేట్లు, డాలర్ విలువలో మార్పులు, ద్రవ్యోల్బణం వంటి పరిణామాల మధ్య బంగారం, వెండి ధరలలో మరిన్ని హెచ్చతగ్గులు ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ జేపీ మోర్గాన్ గ్లోబల్ రీసెర్చ్ మాత్రం బంగారం ధర ఈ ఏడాదిలో రూ. 2లక్షల మార్కుకు చేరుకుంటుందని అంచనా వేసింది. ఔన్సుకు $6,000 మార్కును తాకుతుందని,అలాగే 2027 చివరి నాటికి అది మరింత పుంజుకుని $6,300కు చేరుకుంటుందని అంచనాలను పునరుద్ఘాటించింది.

అదే సమయంలో అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం గోల్డ్‌మన్ సాచ్స్ గ్రూప్ బ్యాంకు మాత్రం తన సంవత్సరాంతపు బంగారం ఔన్సుకు $500 మేరకు తగ్గించేసి.. ఔన్సుకు $4,900గా అంచనాలను సవరించింది.ఆ రెండు ఆర్థిక సంస్థలు బంగారం ధరలను భిన్నంగా అంచనా వేయడం గమనార్హం.

Latest News