Gold and Silver Price Today | పెరిగిన బంగారం, వెండి ధరలు

బులియన్ మార్కెట్ లో బుధవారం 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,970పెరిగి రూ. 151,480వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,800పెరిగి రూ. 1,38,850వద్ద నిలిచింది. అదే విధంగా వెండి ధరలు సైతం పుంజుకున్నాయి. కిలో వెండి ధర రూ. 15,000పెరిగి రూ. 2,65,000కు పెరిగింది.

Gold and Silver Price Today | పెరిగిన బంగారం, వెండి ధరలు

విధాత, హైదరాబాద్ : పశ్చిమాసియా యుద్దం..ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ, ఆర్థిక పరిణమాల క్రమంలో బంగారం, వెండి ధరలలో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. బుధవారం బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,970పెరిగి రూ. 151,480వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,800పెరిగి రూ. 1,38,850వద్ద నిలిచింది. అదే విధంగా వెండి ధరలు సైతం పుంజుకున్నాయి. కిలో వెండి ధర రూ. 15,000పెరిగి రూ. 2,65,000కు పెరిగింది.

మునుముందు పసిడి పరుగులే

ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పెట్టుబడులకు సేఫ్ హెవెన్ గా పసిడి ధరలను ఎంచుకుంటున్నారు. దీంతో పసిడి ధరలు నింగిని తాకుతున్నాయి. ఈ రోజు పసిడి ధరలు దేశీయ మార్కెట్లో భారీగా పెరిగాయి. బంగారం ధరల్లో ఇటీవల కనిపిస్తున్న తగ్గుదల కేవలం తాత్కాలికమేనని.. దీర్ఘకాలికంగా పసిడి తన మెరుపును కోల్పోదని ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకింగ్ సంస్థ వెల్స్ ఫార్గో విశ్లేషించింది. మార్చి ప్రారంభం నుండి బంగారం ధర 15 శాతం కంటే ఎక్కువగా పడిపోయి, ప్రస్తుతం ఔన్సుకు 4,500 డాలర్ల శ్రేణిలో ట్రేడ్ అవుతున్నప్పటికీ, ఇది పెట్టుబడిదారులకు ఒక వ్యూహాత్మక అవకాశమని బ్యాంకు పేర్కొంది.

రాబోయే నెలల్లో ధరలు మళ్లీ పుంజుకుని.. సంవత్సరాంతానికి ఔన్సుకు 6,100 నుండి 6,300 డాలర్ల స్థాయికి చేరుకుంటాయని వెల్స్ ఫార్గో అంచనా వేస్తోంది.ఇది ప్రస్తుత ధరల నుండి దాదాపు 35 శాతం నుండి 40 శాతం పెరుగుదలను సూచిస్తుంది. కేవలం వెల్స్ ఫార్గో మాత్రమే కాకుండా..జేపీమోర్గాన్, యూబీఎస్ వంటి ఇతర అంతర్జాతీయ బ్యాంకులు కూడా ఔన్సుకు 6,000 డాలర్ల పైనే ధర ఉంటుందని ఇలాంటి అంచనాలనే వ్యక్తం చేస్తున్నాయి.

ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో వడ్డీ రేట్లు తగ్గుతాయనే అంచనాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ నిల్వల్లో భాగంగా బంగారం భారీగా కొనుగోలు చేయడం కొనసాగిస్తుండటం కూడా ధరల పెరుగుదలకు దోహదం చేస్తుందని చెబుతున్నారు. రాజకీయ మార్పులు, టారిఫ్‌లు, కొత్త నిబంధనల వల్ల మార్కెట్లో అనిశ్చితి పెరిగే అవకాశం ఉందని, అటువంటప్పుడు రక్షణ కోసం బంగారం వాడకం పెరుగుతుందని విశ్లేషణలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి :

Rajasekhar | చిన్న‌ప్ప‌టి నుండి బైక్స్ అంటే చాలా ఇష్టం.. భ‌యంతో నా బైక్‌ని జీవిత అమ్మేసింది: రాజ‌శేఖ‌ర్
Commercial Gas | భారీగా పెరిగిన క‌మ‌ర్షియ‌ల్ గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లు..!