Gold Silver Price Increase | మళ్లీ పైకి లేచిన బంగారం, వెండి ధరలు !

అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా వరుసగా తగ్గుదల నమోదు చేసిన బంగారం, వెండి ధరలు మంగళవారం అనూహ్యంగా పుంజుకున్నాయి. బులియన్ మార్కెట్ లో మంగళవారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1200పెరిగి రూ. 1,58,620కి పెరిగింది. కిలో వెండి ధర రూ. 4,000 పెరిగి రూ. 2,80,000 వద్ద కొనసాగుతుంది.

Gold Silver Price Increase | మళ్లీ పైకి లేచిన బంగారం, వెండి ధరలు !

విధాత, హైదరాబాద్ : అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా వరుసగా తగ్గుదల నమోదు చేసిన బంగారం, వెండి ధరలు మంగళవారం అనూహ్యంగా పుంజుకున్నాయి. బులియన్ మార్కెట్ లో మంగళవారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1200పెరిగి రూ. 1,58,620కి పెరిగింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1100 పెరిగి రూ. 1,45,400కు చేరింది. ఇదే రీతిలో వెండి ధరల సైతం పెరుగుదలను నమోదు చేశాయి. కిలో వెండి ధర రూ. 4,000 పెరిగి రూ. 2,80,000 వద్ద కొనసాగుతుంది.

హెచ్చు తగ్గులు కొనసాగుతాయి..

పశ్చిమాసియా యుద్దం ప్రభావంతో అంతర్జాతీయంగా చోటుచేసుకున్న ఆర్థిక, రాజకీయ పరిణామాలు, డాలర్ బలపడటం వంటి పరిణామాల మధ్య బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. అయితే అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో మరికొంత కాలం బంగారం ధరలు హెచ్చు తగ్గులు కొనసాగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారం సురక్షిత పెట్టుబడులకు కేంద్రంగా కొనసాగుతుంది. దీంతో బంగారం, వెండి ధరలు పెరుగుదలను నమోదు చేశాయని, మళ్లీ హెచ్చు తగ్గులకు అవకాశం ఉన్నప్పటికి దీర్ఘకాలికంగా బంగారం, వెండి ధరలు మరోసారి పెరుతాయని అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Virosh | హల్దీ వేడుక‌ని హోలీలా మార్చారేంటి.. విజయ్–రష్మిక పెళ్లి జ్ఞాపకాలు వైరల్
Pilot Rohit Reddy| పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ షోకాజ్ నోటీస్ ల జారీ