Pilot Rohit Reddy | పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ షోకాజ్ నోటీస్ ల జారీ

మొయినాబాద్‌ డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి వ్యవహారాన్ని బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకత్వం రోహిత్ రెడ్డికి షోకాజ్‌ నోటీస్‌ జారీ చేసింది.

Reported by: Y.V. Narsimha Reddy | హైదరాబాద్​ | Mar 17, 2026, 2:27 pm IST
Read Time: 3 mins
Pilot Rohit Reddy | పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ షోకాజ్ నోటీస్ ల జారీ

విధాత, హైదరాబాద్ : మొయినాబాద్‌ డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి వ్యవహారాన్ని బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకత్వం రోహిత్ రెడ్డికి షోకాజ్‌ నోటీస్‌ జారీ చేసింది. వారం రోజుల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని పేర్కొంది. వివరణ సంతృప్తికరంగా లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

మెయనా బాద్ ఫామ్ హౌస్ డ్రగ్ కేసు వ్యవహారం పార్టీ ప్రతిష్ఠ, విశ్వసనీయతకు భంగం కలిగించే అవకాశం ఉందని బీఆర్‌ఎస్‌ పేర్కొంది. తుది నిర్ణయం తీసుకునే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని రోహిత్‌రెడ్డిని ఆదేశించింది.

అటు ఇదే కేసులో పట్టుబడిన టీడీపీ ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ పై ఆ పార్టీ అధినేత , ఏపీ సీఎం చంద్రబాబు సైతం సీరియస్ గా స్పందించిన సంగతి తెలిసిందే. డ్రగ్స్‌ వంటి ఘటనల్లో ఎవరున్నా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మహేశ్‌కు నోటీసులు జారీచేసి వివరణ తీసుకోవాలని.. ఘటనపై నివేదిక ఇవ్వాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఆదేశించారు.

చంద్రబాబు ఆదేశాల మేరకు మహేశ్‌కుమార్‌కు పల్లా శ్రీనివాసరావు ఆదివారం షోకాజ్ నోటీస్ జారీ చేశారు. ఐదు రోజుల్లో లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని సూచించారు. ఈ పరిణామాలు పార్టీ ప్రతిష్ఠకు తీవ్రభంగం కలిగించేవిగా ఉన్నాయని భావిస్తోంది అని నోటీసులో పేర్కొన్నారు. నేతలు చేసే తప్పులకు పార్టీ నష్టపోయే పరిస్థితి రానీయబోమని ఈ సందర్బంగా టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి :

Telangana HAM Road Scam | తెలంగాణలో హ్యామ్ రోడ్ల పేరిట రూ.18వేల కోట్ల స్కామ్ : మాజీ మంత్రి హరీశ్ రావు
అసెంబ్లీలో కేటీఆర్ వర్సెస్ మంత్రులు