స్థిరంగా బంగారం, వెండి ధరలు

మంగళవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,55,290వద్ద స్థిరంగా ఉండగా, 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,42,350వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ 5,000 తగ్గి రూ.2,75,000 వద్ద కొనసాగుతుంది

Reported by: Y.V. Narsimha Reddy | వాణిజ్యం | Apr 21, 2026, 11:56 am IST
Read Time: 2 mins
స్థిరంగా బంగారం, వెండి ధరలు

విధాత, హైదరాబాద్: పశ్చిమాసియా యుద్ద ఉద్రిక్తలతో ప్రభావితమవుతున్న బంగారం, వెండి ధరలు మంగళవారం మరోసారి ఒడిదుడుకులకు లోనయ్యాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,55,290వద్ద స్థిరంగా ఉండగా, 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,42,350వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ 5,000 తగ్గి రూ.2,75,000 వద్ద కొనసాగుతుంది.

ఇటీవల కాలంలో బంగారం ధరలు అంతర్జాతీయంగా అనేక ఒడిదుడుకులకు లోనవుతు వస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో బంగారం ధరలు మునుపెన్నడూ లేని విధంగా ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అయితే, పశ్చిమ ఆసియాలో ఇరాన్ యుద్ధం వంటి భౌగోళిక రాజకీయ పరిణామాలు తలెత్తిన తర్వాత మార్కెట్ సమీకరణాలు మారి ధరలు పడిపోయాయి. ఫిబ్రవరి నుంచి బంగారం ధరలలో అనిశ్చిత కొనసాగుతుంది. అయితే భవిష్యత్తులో మాత్రం బంగారం, వెండి ధరలు పుంజుకోవడం ఖాయం అని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Tiwanese Watermelon | పుచ్చ‌కాయ‌ల సాగు.. 3 నెల‌ల్లోనే రూ. కోటికి పైగా సంపాద‌న‌..
Allu Arjun | హైద‌రాబాద్‌కి గుడ్ బై చెప్పి బ‌న్నీ ముంబైకి షిఫ్ట్ అవుతున్నాడా?.. కార‌ణం ఏంటో తెలుసా?