gold silver prices stable| స్థిరంగానే బంగారం, వెండి ధరలు !

ఆదివారం మాత్రం బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,50,930 వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,38,350వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ.2,55,000వద్ద కొనసాగుతుంది.

Reported by: Y.V. Narsimha Reddy | వాణిజ్యం | Apr 05, 2026, 11:14 am IST
Read Time: 3 mins
gold silver prices stable| స్థిరంగానే బంగారం, వెండి ధరలు !

విధాత, హైదరాబాద్ : పశ్చిమాసియా యుద్దంతో ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న రాజకీయ, ఆర్థిక పరిణామాలు ఇంధన ధరలతో పాటు బంగారం, వెండి ధరలపైన ప్రభావం చూపుతున్నాయి. అయితే ఆదివారం మాత్రం బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,50,930 వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,38,350వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ.2,55,000వద్ద కొనసాగుతుంది.

ప్రస్తుతం బంగారం, వెండి ధరలు నిలకడగా ఉన్నప్పటికి… హర్మూజ్ జలసంధి తెరిచే విషయమై అమెరికా విధించిన గడువుకు ఇరాన్ స్పందించకపోతే మళ్లీ యుద్దం తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. అదే జరిగితే మళ్లీ బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా మునుముందు బంగారం ధరలు పెరుగుదలను నమోదు చేసే అవకాశం ఉందంటున్నారు. అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్సుకు 4,677 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇరాన్‌పై దాడులు తీవ్రతరం చేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికల తర్వాత, ముడి చమురు ధరలు పెరగడం బంగారంపై ఒత్తిడిని పెంచింది. ప్రస్తుతం వడ్డీ రేట్ల అంచనాలు, బలమైన డాలర్ కారణంగా కొంత తగ్గుముఖం పట్టినా…భవిష్యత్తులో భారీగా పుంజుకునే అవకాశం ఉందని నిపుణుణులు చెబుతున్నారు.