HDFC Bank | హెచ్‌డీఎఫ్‌సీలో అకౌంట్‌ ఉందా..? ఆ లావాదేవీలపై ఇక అలెర్ట్‌లు బంద్‌..!

HDFC Bank | ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంక్‌ హెచ్‌డీఎఫ్‌సీ కీలక నిర్ణయం తీసుకున్నది. యూపీఐ లావాదేవీలకు సంబంధించి ఇకపై ఎస్‌ఎంఎస్‌లు అలెర్ట్‌లు నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఖాతాదారులకు సందేశం పంపింది. అలర్ట్‌ల జారీ నిలిపివేత జూన్‌ 25 నుంచి అమలులోకి రానున్నట్లు పేర్కొంది.

HDFC Bank | హెచ్‌డీఎఫ్‌సీలో అకౌంట్‌ ఉందా..? ఆ లావాదేవీలపై ఇక అలెర్ట్‌లు బంద్‌..!

HDFC Bank | ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంక్‌ హెచ్‌డీఎఫ్‌సీ కీలక నిర్ణయం తీసుకున్నది. యూపీఐ లావాదేవీలకు సంబంధించి ఇకపై ఎస్‌ఎంఎస్‌లు అలెర్ట్‌లు నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఖాతాదారులకు సందేశం పంపింది. అలర్ట్‌ల జారీ నిలిపివేత జూన్‌ 25 నుంచి అమలులోకి రానున్నట్లు పేర్కొంది. అయితే రూ.100 కన్నా తక్కువ చెల్లింపులపై మాత్రమే ఎస్‌ఎంఎస్‌ల జారీని నిలిపివేస్తున్నామని.. రూ.500 కంటే తక్కువ డిపాజిట్లపై సైతం అలెర్ట్‌లో రావని.. అంతకుపైగా జరిపే లావాదేవీలపై యథావిధిగా అలెర్ట్‌లో వస్తాయని పేర్కొంది. వినియోగదారుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది.

యూపీఐ యాప్‌ల నుంచి నోటిఫికేషన్లు వస్తున్న నేపథ్యంలో చిన్నమొత్తంలో జరిపేలా లావాదేవీలకు ప్రత్యేకంగా అలెర్ట్‌లు అవసరం లేదని ఖాతాదారులు తెలిపారని.. ఈ ఫీడ్‌బ్యాక్‌ మేరకు నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పింది. వాస్తవానికి చిన్న చిన్న లావాదేవీలకు సైతం అలెర్ట్‌లతో కోట్లాది ఎస్‌ఎంఎస్‌లు వినియోగదారులకు చేరుతుండగా.. దీనికి పెద్ద మొత్తంలోనే ఖర్చు చేయాల్సి వస్తుందని బ్యాంకు పేర్కొంది. తాజాగా తీసుకున్న నిర్ణయంతో కొంత డబ్బులు ఆధా అవుతుందని పేర్కొంది.

అలాగే ఖాతాదారులు తమ ప్రైమరీ ఈ-మెయిల్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని కోరింది. ఈ నిర్ణయంతో భారీగా పెరిగాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూపీఐ సేవలను అభివృద్ధి చేసింది. భారతదేశం యూపీఐ లావాదేవీలు గతేడాది ఆల్‌ టైమ్‌ గరిష్ఠ స్థాయికి చేరాయి. 117.6 బిలియన్ లావాదేవీలు జరగ్గా.. వాటి విలు అక్షరాల రూ.183 ట్రిలియన్లు. ఇది అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 59శాతం ఎక్కువగా. అయితే, కరోనా మహమ్మారి అనంతరం దేశవ్యాప్తంగా యూపీఐ లావాదేవీలు జోరందుకున్నాయి.