Ambassador Car | మళ్లీ అంబాసిడర్ పరుగులు.. న్యూ వర్షన్‌తో ఇండియన్ మార్కెట్‌లోకి రంగప్రవేశం
అంబాసిడర్ .. ఈ కారు ఒకప్పుడు భారత దేశంలో ఓ దర్జాకు, దర్పానికి నిదర్శనమైన కారు. మన్నికకు, సురక్షిత ప్రయాణానికి తక్కువ నిర్వాహణ ఖర్చుకు అడ్రస్ అంబాసిడర్ కారు.

విధాత : అంబాసిడర్ .. ఈ కారు ఒకప్పుడు భారత దేశంలో ఓ దర్జాకు, దర్పానికి నిదర్శనమైన కారు. మన్నికకు, సురక్షిత ప్రయాణానికి తక్కువ నిర్వాహణ ఖర్చుకు అడ్రస్ అంబాసిడర్ కారు. రాజకీయ నాయకులకు అప్పట్లో ఐకాన్ కారు. హిందుస్థాన్ మోటార్స్ ఉత్పత్తియైన అంబాసిడర్ కార్ల ఉత్పత్తులు 1957–2014 వరకు కొనసాగాయి. బ్రిటీష్ మూలాలు ఉన్నప్పటికీ, అంబాసీడర్‌ను భారతీయ కారుగానే భావిస్తారు. గతంలో అంబాసిడర్ కారు రోడ్డుపైకి వస్తే.. దాని హవా వేరు. ఈ అంబాసిడర్ కారు ఆ రోజుల్లో కార్లలో కింగ్. ‘కింగ్ ఆఫ్ ఇండియన్ రోడ్స్’ గా దీనికి పేరు ఉండేది.
భారత ఆర్మీ అధికారుల నుంచి ప్రభుత్వ కార్యాలయ అధికారుల వరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, సినిమా సెలబ్రిటీలు ఈ అంబాసిడర్ కారునే వినియోగించేవారు. 90వ దశాబ్ధంలో ఈ కారు ఉంటే.. వారు రిచ్ అన్నట్లే లెక్క. అంబాసీడర్ స్టేటస్‌కి ఓ సింబల్‌గా చెప్పేవారు. జనరేషన్‌కి తగ్గట్టు ఈ కారు అప్ డేట్ అవ్వకపోవడంతో అమ్మకాలు భారీగా పడిపోయాయి. కొన్నేళ్లుగా ఆ కంపనీ తమ కార్ల ఉత్పత్తిని ఇండియన్ మార్కెట్‌లో నిలిపేసింది. ఆటోమొబైల్ రంగంలోకి ఎన్నో కంపెనీలు ప్రవేశించడం, ఈ పాత మాడల్‌కు ఆదరణ తగ్గిపోవడంతో అంబాసీడర్ కార్లు ఆదరణ కోల్పోవడంతో కంపనీ ఉత్పత్తులను నిలిపేస్తూ నిర్ణయం తీసుకున్నది. అయితే సుదీర్ఘ విరామనాంతరం అంబాసిడర్ సంస్థ తమ కార్ల ఉత్పత్తులను తిరిగి ప్రారంభించింది.
తాజాగా ఇండియన్ మార్కెట్ లోకి అంబాసిడర్ న్యూ వర్షన్ మోడల్‌తో అడుగుపెట్టింది. న్యూ లుక్‌తో తిరిగొచ్చిన అంబాసిడర్ కారు ఆకర్షణీయమైన డిజైన్‌తో అదిరే లుక్‌తో మళ్లీ పుర్వవైభవం సాధించేలా కనిపిస్తుంది. కార్ల మార్కెట్‌లో న్యూ అంబాసిడర్ సరికొత్త సంచలనం సృష్టించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. నయా మాడల్ అంబాసిడర్‌ను తిరిగి విడుదల చేయడానికి హిందూస్థాన్ సంస్థ యూరోపియన్ కంపనీతో కలిసి ప్రయత్నాలను వేగవంతం చేసింది. అంబాసిడర్‌లోనే ఈవీని ప్రవేశపెట్టే ఉద్దేశంలోనూ ఆ సంస్థ ప్రయత్నాలు చేస్తుంది.