Honda NX500 | ఈ-క్లచ్ టెక్నాలజీతో హోండా కొత్త అడ్వెంజర్ బైక్.. ఏంటి దీని స్పెషాలిటీ!!

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ సరికొత్త హోండా NX500 E- క్లచ్ ( Honda NX500 E-Clutch) బైక్‌ను భారత మార్కెట్‌‌లో విడుదల చేసింది.

Honda NX500 | ఈ-క్లచ్ టెక్నాలజీతో హోండా కొత్త అడ్వెంజర్ బైక్.. ఏంటి దీని స్పెషాలిటీ!!

Honda NX500 | ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ సరికొత్త హోండా NX500 E- క్లచ్ ( Honda NX500 E-Clutch) బైక్‌ను భారత మార్కెట్‌‌లో విడుదల చేసింది. అత్యాధునిక ఈ క్లచ్ టెక్నాలజీతో వచ్చిన ఈ మిడిల్ వెయిట్ అడ్వెంచర్ టూరర్ ప్రారంభ ధరను రూ.7.44లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించారు. కొత్త టెక్నాలజీ కారణంగా ట్రాఫిక్‌లో, లాంగ్ టూర్లలో క్లచ్ వినియోగాన్ని తగ్గిస్తూ రైడర్లకు ఇది మరింత సౌకర్యవంతమైన అనుభవాన్ని అందించనుంది.

ఈ కొత్త NX500 రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. Mat Gunpowder Black Metallic, Pearl Horizon White రంగుల్లో ఈ బైక్‌లు కలవు. ఇక సంప్రదాయ NX500 బైక్‌ ధర రూ.5.30 లక్షలు (ఎక్స్ షోరూమ్) కాగా, ఈ-క్లచ్ బైక్ ధరను రూ.7.44 లక్షలుగా నిర్ణయింంచారు. అంటే సాధారణ బైక్‌తో పోలిస్తే దీని ధర రూ.1.11 లక్షలు ఎక్కువ.

E-Clutch టెక్నాలజీ అంటే ఏంటి?

హోండా తీసుకొచ్చిన ఈ-క్లచ్ ఒక ఆటోమేటిక్ క్లచ్ సిస్టమ్. ఇది వాహనాన్ని స్టార్ట్ చేసేటప్పుడు, గేర్లు మార్చేటప్పుడు క్లచ్ లివర్ వాడకాన్ని తగ్గిస్తుంది. సాధారణ మాన్యువల్ గేర్‌‌బాక్స్‌ బైక్‌ల్లో గేర్ మార్పుల సమయంలో క్లచ్ లివర్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే ఈ కొత్త టెక్నాలజీలో ఎలక్ట్రానిక్ యాక్యుయేటర్లు క్లచ్ వ్యవస్థను ఆటోమేటిక్‌గా నియంత్రిస్తాయి. అంటే గేర్ మార్చేటప్పుడు క్లచ్ ఎప్పుడు పట్టాలి? ఎప్పుడు వదలాలి అనేది బైక్‌‌లో ఉండే చిన్న ఎలక్ట్రానిక్ మోటర్ ఆటోమేటిక్‌గా చూసుకుంటుంది. కాబట్టి బైక్ స్టార్ చేసినప్పుడు, ఆపినప్పుడు, గేర్లు మార్చే సమయంలో క్లచ్ లివర్ ఉపయోగించాల్సిన అవసరం ఎక్కువగా రాదు.

అయితే ఇది పూర్తి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లా కాకుండా, రైడర్ కోరుకున్నప్పుడు క్లచ్ లివర్‌ను సంప్రదాయ పద్ధతిలో ఉపయోగించుకోవచ్చు. రైడర్ నుంచి మాన్యువల్ ఇన్‌పుట్‌ను సిస్టమ్ గుర్తించినప్పుడు ఇది దానంతట అదే డిస్‌ఎంగేజ్ అవుతుంది. తర్వాత తిరిగి ఎంగేజ్ అవుతుంది. TFTడిస్‌ప్లే ద్వారా ఈ-క్లచ్ ఫంక్షన్‌ను పూర్తిగా డిసేబుల్ చేసే ఆప్షన్ కూడా ఉంది. భారత రోడ్ల పరిస్థితులు, స్టాప్ గో ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సిస్టమ్‌ను ప్రత్యేకంగా ట్యూన్ చేసినట్లు హోండా కంపెనీ తెలిపింది.

ఇంజిన్‌ పనితీరు

సంప్రదాయ NX500తో పోలిస్తే టెక్నాలజీ అప్‌డేట్స్ తప్ప మెకానికల్‌పరంగా ఎలాంటి మార్పులు లేవు. ఈ బైక్‌ 471CC లిక్విడ్ కూల్డ్‌ ఫ్యారలల్ ట్విన్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 8500rpm వద్ద 47bhp పవర్, 6500 rpm వద్ద 43nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

అలాగే E-Clutch సిస్టమ్ కారణంగా ఈ బైక్ బరువు సుమారు 3 కిలోలు పెరిగింది. దీంతో మొత్తం బైక్ బరువు 199 కిలోలుగా మారింది. ఇక సుదీర్ఘ ప్రయాణాల్లో స్థిరత్వం, సౌకర్యం కోసం స్టీల్ డైమండ్ ఫ్రేమ్‌ను ఇందులో ఉపయోగించారు.

ఈ అడ్వెంచర్ టూరర్‌ ముందు భాగంలో Showa SFF – BP upside – down forks, వెనుక భాగంలో preload adjustable monoshock సస్పెన్షన్ వ్యవస్థను అందించారు. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ముందు భాగంలో ట్విన్ 296 mm డిస్క్ బ్రేకులు, వెనుక భాగంలో 240mm డిస్క్ బ్రేక్‌లను ఏర్పాటు చేశారు. రేడియల్ మౌంటెడె్ నిస్సిన్ కాలిపర్స్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ సిస్టమ్ భద్రతను మరింత పెంచాయి. ఇక బైక్ ముందు 19 అంగుళాల, వెనుక 17 అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో వస్తోంది. దీనివల్ల హైవే టూరింగ్‌తో పాటు తేలికపాటి ఆఫ్ రోడింగ్‌కు కూడా ఇది అనుకూలంగా ఉంటుంది.

ఫీచర్లు

ఫీచర్ల విషయానికి వస్తే NX500 E-Clutch బైక్‌లో 5 అంగుళాల ఫుల్ కలర్ TFT డిస్‌ప్లేను అందించారు. ఇందులో Honda RoadSync కనెక్టివిటీ ఉంటుంది. దీని ద్వారా స్మార్ట్‌ఫోన్ నావిగేషన్, కాల్స్, మ్యూజిక్ కంట్రోల్ వంటి ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు. దీనికి అదనంగా హోండా సెలక్టెబుల్ టార్క్ కంట్రోల్ (HSTC), ఫుల్ LED లైటింగ్ వంటి ప్రీమియం ఫీచర్లు కూడా ఇందులో లభిస్తున్నాయి.

Read More:

ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో టాటా ఆల్ట్రోజ్ iCNG.. ధర ఎంతంటే..!

హోండా నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్.. WN7 మోడల్‌కు భారత్‌లో పేటెంట్ దాఖలు!