Gold | దుబాయి నుంచి పరిమితికి మించి బంగారం తెస్తున్నారా..? ఈ నియ‌మాలు పాటించాల్సిందే..!!

Gold | దుబాయ్( Dubai ) నుంచి ఇండియా( India )కు బంగారం( Gold ) తెచ్చేట‌ప్పుడు ఈ నియ‌మాలు పాటిస్తే.. క‌స్ట‌మ్స్ అధికారుల( Customs Officers ) నుంచి ఈజీగా త‌ప్పించుకోవ‌చ్చు. లీగ‌ల్‌గా ఎలాంటి నియ‌మాలు పాటించాలో ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం..

Gold | దుబాయి నుంచి పరిమితికి మించి బంగారం తెస్తున్నారా..? ఈ నియ‌మాలు పాటించాల్సిందే..!!

Gold | బంగారం( Gold ) అక్ర‌మంగా త‌ర‌లిస్తున్నార‌నే వార్త‌లు ప్ర‌తి రోజు వింటూనే ఉంటాం. ప్ర‌ధానంగా ఎయిర్‌పోర్టుల్లో( Airports ) బంగారాన్ని అక్ర‌మంగా త‌ర‌లిస్తూ క‌స్ట‌మ్స్ అధికారుల‌కు( Customs Officers ) ప‌ట్టుబ‌డుతుంటారు. అది కూడా దుబాయ్( Dubai ) నుంచి దొంగ‌దారిన బంగారం త‌లించే వారు బాగానే ఉంటారు. వివిధ రూపాల్లో బంగారాన్ని అక్ర‌మంగా త‌ర‌లించి.. క‌స్ట‌మ్స్ అధికారుల‌కు చిక్క‌కుండా కూడా బ‌య‌ప‌డుతుంటారు. కానీ కొన్ని సంద‌ర్భాల్లో అడ్డంగా బుక్ అవుతుంటారు. మ‌రి దుబాయ్ నుంచి ఇండియా( India )కు బంగారం తెచ్చేట‌ప్పుడు ఈ నియ‌మాలు పాటిస్తే.. క‌స్ట‌మ్స్ అధికారుల నుంచి ఈజీగా త‌ప్పించుకోవ‌చ్చు. లీగ‌ల్‌గా ఎలాంటి నియ‌మాలు పాటించాలో ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం..

అయితే దుబాయ్‌లో భార‌త్ కంటే త‌క్కువ‌గా బంగారం ధ‌ర‌లు ఉంటాయి. అందుకే బంగారానికి దుబాయ్ ప్ర‌సిద్ధి చెందింది. ఈ క్ర‌మంలో అక్క‌డ్నుంచి బంగారాన్ని ఇండియాకు త‌ర‌లించి.. ఇక్క‌డ అధిక రేటుకు గోల్డ్‌ను విక్ర‌యించి డ‌బ్బు సంపాదించాల‌నుకుంటారు. ఈ క్ర‌మంలో ఆత్యాశ‌కు పోయి అడ్డంగా దొరుకుతుంటారు. కొంద‌రేమో త‌ప్పించుకుని ద‌ర్జాగా బ‌య‌ట‌ప‌డుతుంటారు. అయితే చ‌ట్ట‌బ‌ద్దంగా దుబాయ్ నుంచి మ‌న దేశానికి బంగారాన్ని దిగుమ‌తి చేసుకోవాలంటే కొన్ని క‌స్ట‌మ్స్ నిబంధ‌న‌లు పాటిస్తే స‌రిపోతోంది.

మ‌రి దుబాయ్‌లోనే బంగారం ధ‌ర త‌క్కువ ఎందుకు..?

భార‌త్‌తో పోలిస్తే బంగారం ధ‌ర‌లు దుబాయ్‌లోనే త‌క్కువ‌. ఎందుకంటే.. అక్క‌డ గోల్డ్ కొనుగోళ్ల‌పై ఎలాంటి ప‌న్నూ విధించ‌రు. కాబ‌ట్టి అద‌న‌పు సుంకాలు చెల్లించ‌కుండానే మార్కెట్ ధ‌ర‌కు ప‌సిడి సొంతం చేసుకోవ‌చ్చు. భార‌త్‌లా దిగుమ‌తి సుంకం విధించ‌క‌పోవ‌డ‌మే ఇందుకు కార‌ణం. అంతేకాకుండా దుబాయ్ బంగారం వ్యాపారుల మ‌ధ్య తీవ్ర‌మైన పోటీ కార‌ణంగా పెద్ద ఎత్తున అక్క‌డ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టిస్తూ కొనుగోలుదారుల‌ను ఆక‌ర్షిస్తుంటారు. ఈ కార‌ణంతో దుబాయ్‌లో బంగారం త‌క్కువ ధ‌ర‌కే ల‌భ్య‌మ‌వుతుంది.

భార‌త్‌కు బంగారం తెచ్చేందుకు పాటించాల్సిన నిబంధ‌న‌లు ఇవే..

-దుబాయ్ నుంచి భార‌త్‌కు బంగారం తీసుకురావాలంటే.. క‌చ్చితంగా ఇండియ‌న్ పాస్‌పోర్టు క‌లిగి ఉండాలి. క‌నీసం అక్క‌డ ఆరు నెల‌లకు పైగా ఉండాలి.
-విదేశాల్లో 30 రోజుల కంటే త‌క్కువ ఉన్న ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోరు. ఇది చ‌ట్టాన్ని ఉల్లంఘించిన‌ట్టే అవుతుంది.

ఎంత వ‌ర‌కు బంగారం తీసుకురావొచ్చు..

-పురుషులైతే 20 గ్రాముల వ‌ర‌కు( రూ. 50 వేల విలువ వ‌ర‌కు) తీసుకురావొచ్చు. ఎలాంటి క‌స్ట‌మ్స్ సుంకం చెల్లించ‌కుండా.
-మ‌హిళ‌లైతే 40 గ్రాముల వ‌ర‌కు (రూ. ల‌క్ష విలువ వ‌ర‌కు) ఎలాంటి క‌స్ట‌మ్స్ సుంకం లేకుండా తీసుకురావొచ్చు.
-15 ఏండ్ల లోపు పిల్ల‌లు కూడా 40 గ్రాముల వ‌ర‌కు బంగారం తీసుకురావొచ్చు. పిల్ల‌లు కూడా క‌స్ట‌మ్స్ సుంకం చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు.

ప‌రిమితికి మించి బంగారం తీసుకువ‌స్తే..?

-పురుషులు 50 గ్రాముల వ‌ర‌కు, మ‌హిళ‌లు 100 గ్రాముల వ‌ర‌కు బంగారం తీసుకువ‌స్తే 3 శాతం క‌స్ట‌మ్స్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది.
-పురుషులు 50 నుంచి 100 గ్రాములు, మ‌హిళ‌లు 100 నుంచి 200 గ్రాముల వ‌ర‌కు తీసుకువ‌స్తే 6 శాతం, పురుషులు 100 గ్రాముల పైన‌, మ‌హిళ‌లు 200 గ్రాముల పైన తీసుకువ‌స్తే 10 శాతం క‌స్ట‌మ్స్ డ్యూటీ చెల్లించాలి.

ఈ ధృవ‌ప‌త్రాలు త‌ప్ప‌నిస‌రి..

-చ‌ట్ట‌బ‌ద్దంగా బంగారం కొనుగోలు చేసిన‌ట్లు అయితే.. ఎయిర్‌పోర్ట్ చెక్ పాయింట్ల వ‌ద్ద బంగారంతో పాటు దాని కొనుగోలుకు సంబంధించి ధృవ‌ప‌త్రాలు చూపించాలి.
-కొనుగోలుకు సంబంధించిన ఇన్‌వాయిస్‌లతో పాటు బంగారం నాణ్య‌త‌, ధ‌ర‌కు సంబంధించిన ర‌శీదులు కూడా చూపించాల్సి ఉంటుంది.
-ప‌రిమితికి మించి బంగారం తెస్తున్న‌ప్పుడు క‌స్ట‌మ్స్ డ్యూటీ చెల్లించేందుకు సిద్ధంగా ఉండాలి.

ఈ నియ‌మాలు పాటించాలి..

– దుబాయ్‌లో అథ‌రైజేష‌న్ డీల‌ర్ల వ‌ద్ద‌నే బంగారం కొనుగోలు చేయాలి.
-బంగారం కొనుగోలుకు సంబంధించిన ర‌శీదులు భ‌ద్రంగా దాచి ఉంచాలి.
-పాస్‌పోర్ట్, వీసా త‌ప్ప‌నిస‌రిగా క‌లిగి ఉండాలి.
-బంగారు క‌డ్డీల కంటే బంగారు ఆభ‌ర‌ణాల‌కు ప్రాధాన్య‌త ఇవ్వండి.
-ఈ నియ‌మాల‌ను పాటిస్తే సుల‌భంగా దుబాయ్ నుంచి ఇండియాకు బంగారం తీసుకురావొచ్చు.