Post Office Scheme | పోస్టాఫీస్‌లో రోజుకు రూ.50 పెట్టుబడితో రూ.30 లక్షలు పొందొచ్చు..!

Post Office Scheme | ప్రజల కోసం అనేక రకాల సేవింగ్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ వివిధ రకాల స్కీమ్స్‌లో చేరి డబ్బును పొదుపు చేసుకునే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ద్వారా కొన్ని సేవింగ్ స్కీమ్స్ అమలవుతుండగా.. మరికొన్ని పోస్టాఫీస్‌లు, బ్యాంకుల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. చాలా పథకాలు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందేవి ఉన్నాయి.

Post Office Scheme | పోస్టాఫీస్‌లో రోజుకు రూ.50 పెట్టుబడితో రూ.30 లక్షలు పొందొచ్చు..!

Post Office Scheme : ప్రజల కోసం అనేక రకాల సేవింగ్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ వివిధ రకాల స్కీమ్స్‌లో చేరి డబ్బును పొదుపు చేసుకునే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ద్వారా కొన్ని సేవింగ్ స్కీమ్స్ అమలవుతుండగా.. మరికొన్ని పోస్టాఫీస్‌లు, బ్యాంకుల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. చాలా పథకాలు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందేవి ఉన్నాయి.

ముఖ్యంగా వృద్ధాప్యంలో ఆర్థిక సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు పోస్టాఫీస్‌లో ఒక అద్భుత పథకం ఉంది. ఆ పథకం పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆ పథకం పేరు గ్రామ్ సురక్ష స్కీమ్. ఇది కేవలం సేవింగ్స్‌ మాత్రమే కాకుండా హెల్త్‌, లైఫ్‌ అస్యూరెన్స్‌ పాలసీ కావడం దీని ప్రత్యేకత. 1955లో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ స్కీమ్‌లో చేరిన వ్యక్తి 80 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత దాని ఫలాలు అందుకుంటాడు.

ఈ స్కీమ్‌లో వచ్చే బోనస్‌తోపాటు మొత్తం నగదు అందిస్తారు. టర్మ్ పాలసీ పూర్తి కాకుండానే బీమా చేసిన వ్యక్తి మరణించినట్లయితే మొత్తం డబ్బులను నామినీకి లేదా కుటుంబ సభ్యులకు ఇస్తారు. ఈ స్కీమ్‌లో చేరేందుకు 19 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వాళ్లు అర్హులు. 19 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండే ఎవరైనా ఈ స్కీమ్ లో చేరవచ్చు.

ఈ స్కీమ్‌లో ప్రీమియం కట్టేందుకు మూడు రకాల ఆప్షన్‌లు ఉన్నాయి. 3 నెలలు, 6 నెలలు లేదా ఏడాదికి ఒకసారి ప్రీమియం చెల్లింపులు చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రీమియం చెల్లింపు కోసం గరిష్ఠ వయస్సును మూడు స్థాయిల్లో ఎంచుకోవచ్చు. ఈ మేరకు 55 ఏళ్లు, 58 ఏళ్లు, 60 ఏళ్లు వచ్చే వరకు ప్రీమియం చెల్లించే వెసులుబాటు ఉంది. ఈ ప్రీమియంలో నచ్చిన ఆప్షన్ ఎంపిక చచేసుకోవచ్చు.

అంతేగాక ఈ పథకం ద్వారా రుణం తీసుకునే అవకాశం కూడా ఉంది. పాలసీ తీసుకున్న నాలుగేళ్ల తర్వాత రుణం పొందే అవకాశం ఉంది. ఈ రుణంపై 10 శాతం వడ్డీ ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు 19 ఏళ్ల వయసులో రూ.10 లక్షల మొత్తానికి పాలసీ తీసుకున్నారని అనుకుందాం. దానికి 55 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లిస్తే.. చివర్లో 31.60 లక్షల రూపాయల రిటర్న్‌ లభిస్తుంది.

అదే రూ.10 లక్షల మొత్తానికి 58 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లిస్తే రూ.33.4 లక్షల వరకు వస్తుంది. అలాగే 60 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లిస్తే 34.60 లక్షల రూపాయల మెచ్యూరిటీ పొందొచ్చు. 55 ఏళ్ల మెచ్యూరిటీ కోసం నెలకు రూ.1,515 రూపాయలు ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. ఆ రూ.1,515 రూపాయలను నెలకు లెక్కచేస్తే రోజుకు రూ.50 మాత్రమే అవుతుంది. ఒకవేళ 58 ఏళ్లకు పెట్టుకున్నట్లయితే అదే అమౌంట్ రూ.1463కి తగ్గుతుంది.

అదేవిధంగా 60 ఏళ్ల వరకు పెట్టుకున్నట్లయితే ఇంకా తగ్గి రూ.1,411 చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంగా అలా ఈ స్కీమ్ ద్వారా రోజుకు 50 రూపాయలు పెట్టి చివర్లో రూ.30 లక్షలు పొందవచ్చు. ఇప్పటికే ఎంతో మంది ఈ స్కీమ్ లో చేరారు. ఈ స్కీమ్ గురించిన మరింత సమాచారం కోసం మీ సమీపంలోని పోస్టాఫీస్‌ను సంప్రదించవచ్చు.