Dosamaa | దోసలు వేయాలనే తపనతో.. లక్షల రూపాయాల జీతాన్ని వదిలేసుకున్న యువకుడు..
Dosamaa | ఓ యువకుడు జర్మనీ( Germany )లో ఉన్నత చదువులు చదివాడు. అక్కడే మంచి ఉద్యోగం సంపాదించాడు. నెలకు జీతం లక్షల రూపాయాల్లో. కానీ ఆ ఉద్యోగం తనకు సరికాదనుకున్నాడు. భారత్( India )కు చెందిన ఆ యువకుడు తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని ఎప్పుడూ అనుకునేవాడు. ఆ ఆలోచనల నుంచి పుట్టిందే దోసెల బిజినెస్( Dosamaa Brand ).
Dosamaa | ఓ యువకుడు జర్మనీ( Germany )లో ఉన్నత చదువులు చదివాడు. అక్కడే మంచి ఉద్యోగం సంపాదించాడు. నెలకు జీతం లక్షల రూపాయాల్లో. కానీ ఆ ఉద్యోగం తనకు సరికాదనుకున్నాడు. భారత్( India )కు చెందిన ఆ యువకుడు తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని ఎప్పుడూ అనుకునేవాడు. ఆ ఆలోచనల నుంచి పుట్టిందే దోసెల బిజినెస్( Dosamaa Brand ). భారతీయులకు గ్లూటెన్ రహిత దోసల( Gluten Free Dosa )ను అందించాలనే ఉద్దేశంతో.. జర్మనీలో లక్షల రూపాయాల జీతాన్ని వదిలేసుకున్నాడు. ఆ తర్వాత దోసెమా అనే బ్రాండ్ పేరుతో దోసెలు వేయడం ప్రారంభించాడు. ఈ వ్యాపారాన్ని 2023లో ప్రారంభించగా… ఇప్పటికీ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది.
తెల్లవారుజామున 3 గంటలకే కిచెన్‌లోకి
భారత్‌కు చెందిన మోహన్ అనే యువకుడు జర్మనీలో ఉన్నత చదువులు అభ్యసించి.. అక్కడే మంచి కొలువు కొట్టేశాడు. ప్యాకేజీ కూడా లక్షల్లో ఉంది. కానీ ఉద్యోగానికి రాజీనామా చేసి.. 2023లో తన స్నేహితులతో కలిసి దోసమా అనే బ్రాండ్‌తో ఆహార రంగంలోకి అడుగుపెట్టాడు. ఇక మోహన్ స్వయంగా దోసలు వేస్తూ.. తన కోరికను నెరవేర్చుకున్నాడు. తెల్లవారుజామున 3 గంటలకే కిచెన్‌లోకి అడుగుపెట్టి.. ఎన్నో అడ్డంకులను అధిగమించి.. నిద్రలేని రాత్రులు గడుపుతూ లక్ష్యాన్ని ముద్దాడాడు. ఆర్థిక ఒత్తిళ్లను అధిగమించి.. ఇప్పుడు లాభాల బాట పట్టాడు. ఈ ప్రయాణంలో ఎన్ని అడ్డంకులు కలిగినా మోహన్ అడుగు వెనుకకు వేయలేదు. కష్టపడితే సాధ్యం కానిది లేదంటూ విజయం సాధించాడు.
పారిస్ టు లండన్.. దోసమా బ్రాండ్ విస్తరణ
మొదటి దోసమా అవుట్‌లెట్‌ను పారిస్‌లో ప్రారంభించాడు. అక్కడి భారతీయులు దోసమా బ్రాండ్‌ను ఆదరించారు. గ్లూటెన్ రహిత దోసెలను ఇష్టంగా తిన్నారు. మోహన్‌కు అండగా నిలిచారు. కొద్ది కాలంలోనే దోసమా బ్రాండ్ లండన్‌కు విస్తరించింది. ఇప్పుడు పుణెలోని ఎఫ్‌సీ రోడ్డులో కొత్త దోసమా అవుట్‌లెట్‌ను ప్రారంభించాడు మోహన్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దోసమా బ్రాండ్ ఇప్పుడు.. భారతీయ ఆహార రుచులను పరిచయం చేసేలా తయారైంది.
నెటిజన్ల ప్రశంసలు
దోసమా బ్రాండ్‌తో ఆహార రంగంలోకి అడుగుపెట్టిన మోహన్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. లక్షల రూపాయాల జీతాన్ని వదిలేసి.. దోసమా అవుట్‌లెట్ ప్రారంభించడం గ్రేట్ అని కొనియాడుతున్నారు. గ్లూటెన్ రహిత దోస అందించాలన్న మోహన్ ఆలోచన అద్భుతమని ప్రశంసిస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram