Mahindra | కొత్త స్టీరింగ్‌తో రానున్న మహీంద్రా SUVలు.. ఫ్యూచరిస్టిక్ డిజైన్‌కు పేటెంట్ దాఖలు

Mahindra | దేశీయ ఆటో దిగ్గజం మహీంద్ర రానున్న SUVల కోసం కొత్త తరహా స్టీరింగ్ వీల్ డిజైన్ కోసం పేటెంట్ దాఖలు చేసింది. Vision X, Vision S, Vision T, Vision SXT పేర్లతో నాలుగు కాన్సెప్ట్ మోడళ్లకు సంబంధించిన స్టీరింగ్ వీల్ డిజైన్లు పేటెంట్ రూపంలో బయటకు వచ్చాయి.

Mahindra | దేశీయ ఆటో దిగ్గజం మహీంద్ర రానున్న SUVల కోసం కొత్త తరహా స్టీరింగ్ వీల్ డిజైన్ కోసం పేటెంట్ దాఖలు చేసింది. గత ఏడాది ముంబైలో జరిగిన ఫ్రీడమ్ NU ఈవెంట్‌లో మహీంద్రా కంపెనీ Vision X, Vision S, Vision T, Vision SXT పేర్లతో నాలుగు కాన్సెప్ట్ వాహనాలను ప్రదర్శించింది. వీటిలో Vision S ఉత్పత్తి మోడల్ ఇప్పటికే రోడ్లపై టెస్టింగ్ దశలో ఉండగా.. తాజాగా మిగిలిన మూడు మోడళ్లకు సంబంధించిన స్టీరింగ్ వీల్ డిజైన్లు పేటెంట్ రూపంలో వెలుగులోకి వచ్చాయి.

ఇప్పటికే Vision S ఉత్పత్తి వెర్షన్ భారత రోడ్లపై టెస్టింగ్‌ను ప్రారంభించింది. ఇది సబ్ 4 మీటర్ SUV సెగ్మెంట్‌లో స్కార్పియో బ్రాండ్‌కు పొడిగింపుగా రావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆధునిక సస్పెన్షన్, స్మార్ట్ ఫీచర్లతో ఈ SUV రానుందని ప్రచారం జరుగుతోంది.

ఇక తాజాగా బయటపడిన పేటెంట్ చిత్రాల్లో Vision X, Vision T, Vision SXT మోడళ్ల స్టీరింగ్ వీల్ డిజైన్లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. వీటిలో విజన్ ఎక్స్ కోసం రూపొందించిన స్టీరింగ్ వీల్ సంప్రదాయ గుండ్రటి ఆకారానికి భిన్నంగా కనిపిస్తోంది. ఇది రెక్టాంగులర్ డిజైన్‌తో నాలుగు స్పోక్స్‌తో ఫ్యూచరిస్టిక్ లుక్‌ను అందిస్తోంది. టెక్నాలజీ ఆధారిత సబ్-4 మీటర్ SUVగా దీన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం.

ఏరోడైనమిక్ ప్రొఫైల్, ఆధునిక లైన్లు, కొత్త తరహా ఇంటీరియర్ దీని ప్రత్యేకతగా చెబుతున్నారు. దీని క్యాబిన్‌లో డ్యూయల్ 12.3 అంగుళాల స్క్రీన్లు, క్లీన్ సెంటర్ కన్సోల్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ కోసం ట్రాపిజాయిడల్ డిస్‌ప్లే వంటి ఆధునిక ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.

మరోవైపు విజన్ టి, విజన్ ఎస్‌ఎక్స్‌టీ మోడళ్లు మాత్రం బలమైన, మస్క్యులర్ ఎస్‌యూవీ లుక్‌తో రానున్నాయి. విజన్ టీని Thar Roxx ఎలక్ట్రిక్ కాన్సెప్ట్‌గా భావిస్తున్నారు. T అక్షరం Tharను సూచిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇది 5 డోర్ మోడల్‌గా భారీ గ్రిల్, సంప్రదాయ SUV ఆకృతితో కనిపించనుంది.

Vision SXTని Vision T పికప్ ట్రక్ వెర్షన్‌గా చెబుతున్నారు. ఇది చిన్న లోడింగ్ బేతో పాటు పాత బొలెరో ఇన్వేడర్ మోడల్‌ను గుర్తుచేసేలా ఉంటుందని ఆటోమొబైల్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ రెండు వాహనాల్లో ఒకే తరహా ఇంటీరియర్ డిజైన్, పోర్ట్రెయిట్ స్టైల్ టచ్‌స్క్రీన్, హారిజాంటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. భవిష్యత్ SUVల రూపకల్పనలో ఫ్యూచరిస్టిక్ డిజైన్, స్మార్ట్ టెక్నాలజీ, గ్లోబల్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని మహీంద్రా ముందుకు సాగుతున్నట్లుగా ఈ పేటెంట్లు స్పష్టం చేస్తున్నాయని ఆటోరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Latest News