Angel One: ఏంజెల్ వన్ ఏఎంసీ నుంచి కొత్త నిఫ్టీ 50 ఫండ్ల ప్రకటన

  • By: sr    business    May 09, 2025 10:54 AM IST
Angel One: ఏంజెల్ వన్ ఏఎంసీ నుంచి కొత్త నిఫ్టీ 50 ఫండ్ల ప్రకటన

ముంబై: ఏంజెల్ వన్ లిమిటెడ్ సబ్సిడియరీ ఏంజెల్ వన్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ రెండు కొత్త ప్యాసివ్ ఫండ్లను ప్రవేశపెట్టింది. అవి ఏంజెల్ వన్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్, ఏంజెల్ వన్ నిఫ్టీ 50 ఈటీఎఫ్. ఈ న్యూ ఫండ్ ఆఫర్‌లు (ఎన్ఎఫ్ఓ) మే 5, 2025 నుంచి మే 16, 2025 వరకు సబ్‌స్క్రిప్షన్ కోసం తెరిచి ఉంటాయి. ఈ ఫండ్లు నిఫ్టీ 50 ఇండెక్స్‌ను ట్రాక్ చేస్తాయి. భారతదేశంలోని టాప్ 50 లార్జ్-క్యాప్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టే అవకాశాన్ని ఇన్వెస్టర్లకు అందిస్తాయి. ఈ కంపెనీలు టెలికాం, ఆయిల్ అండ్ గ్యాస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్‌కేర్, ఆటోమొబైల్ వంటి 15 కీలక రంగాల్లో ఉన్నాయి. సరళత, స్థిరత, తక్కువ ఖర్చుతో భారత ఆర్థిక వృద్ధిలో భాగస్వామ్యం కావచ్చు. ఈ ఫండ్లను ఖర్చుల ముందు ఇండెక్స్ రిటర్న్‌లను సమీపంగా అందించేలా రూపొందించారు. ఏంజెల్ వన్ ఏఎంసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓ హేమెన్ భాటియా మాట్లాడుతూ… “లార్జ్-క్యాప్ ఈక్విటీలో పెట్టుబడి పెట్టడానికి నేరుగా స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్ల ద్వారా అనేక మార్గాలున్నాయి. నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ లేదా ఈటీఎఫ్‌లో పెట్టుబడి పెట్టడం స్టాక్ ఎంపిక, మానవ విచక్షణ వంటి రిస్క్‌లను తొలగిస్తుంది” అన్నారు.