PuREPower: కొత్త‌ ఉత్పత్తులను ప్రారంభించిన ‘ప్యూర్’పవర్

PuREPower: కొత్త‌ ఉత్పత్తులను ప్రారంభించిన ‘ప్యూర్’పవర్

హైదరాబాద్: ఎలక్ట్రిక్ మొబిలిటీ స్వచ్ఛ విద్యుత్ ఆవిష్కరణల్లో అగ్రగామి సంస్థ ప్యూర్ (PURE), భారత శక్తి పరివర్తన ప్రస్థానాన్ని వేగవంతం చేసే దిశగా PuREPower పేరిట విప్లవాత్మకమైన శక్తి నిల్వ ఉత్పత్తులను ఆవిష్కరించింది. భారత డీకార్బనైజేషన్ పునరుత్పాదక శక్తి లక్ష్యాల సాధన దిశగా ముందుకెళ్లడంలో వివిధ విభాగాలవ్యాప్తంగా PuREPower Home, PuREPower Commercial, రాబోయే PuREPower Grid దోహద పడనున్నాయి. విశ్వసనీయమైన, విస్తరించతగిన, పర్యావరణహితమైన శక్తి నిల్వ ఉత్పత్తుల అవసరాలను తీర్చే విధంగా ఇవి ఉంటాయి. భారీ డీలర్/డిస్ట్రిబ్యూటర్ నెట్‌వర్క్ ద్వారా అధునాతన శక్తి నిల్వ ఉత్పత్తులను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్యూర్ కట్టుబడి ఉంది. భాగస్వాములకు సమగ్రమైన సాంకేతిక, వాణిజ్యపరమైన మద్దతును అందించేందుకు కంపెనీ వచ్చే 18 నెలల్లో భారతదేశ వ్యాప్తంగా 300+ టచ్‌ పాయింట్లను ఏర్పాటు చేసే ప్రణాళికల్లో ఉంది.

PuREPower Home ధర రూ. 74,999/- (ఎక్స్-ఫ్యాక్టరీ) నుంచి ప్రారంభమవుతుంది. “PuREPower అనేది శక్తి నిల్వ ఉత్పత్తి మాత్రమే కాదు, ఇది భారత డీకార్బనైజేషన్ లక్ష్యాల పట్ల నిబద్ధతకు నిదర్శనం. గృహాలు, వ్యాపారాలు, గ్రిడ్‌కు అధునాతన బ్యాటరీ టెక్నాలజీ పవర్ ఎలక్ట్రానిక్స్‌పరమైన సాధికారత కల్పించడం ద్వారా, యావద్దేశం కర్బన ఉద్గారాలను తగ్గించుకోవడంలో ప్యూర్ తోడ్పడుతుంది” అని భారత స్వచ్ఛ విద్యుత్ పరివర్తనలో శక్తి నిల్వ పాత్రను ప్యూర్ వ్యవస్థాపకుడు, ఎండీ డా.నిశాంత్ దొంగారి వివరించారు. “పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని, శక్తి నిల్వ సమన్వయాన్ని ప్రోత్సహించాలన్న ప్రభుత్వ లక్ష్య సాధనకు PuREPower మద్దతుగా నిలుస్తుంది. సౌర విద్యుత్‌ను సమర్ధవంతంగా నిల్వ చేసుకోవడంలో గృహాల యజమానులకు తోడ్పడటం నుంచి పర్యావరణహితమైన విధంగా కార్యకలాపాలు నిర్వహించుకునేలా పరివర్తన చెందడంలో వ్యాపారాలకు సహాయపడటం వరకు, విద్యుత్‌కి సంబంధించి పర్యవరణ అనుకూల పరిస్థితులను PuREPower సమర్ధవంతంగా తీర్చిదిద్దుతోంది” అని ప్యూర్ సహ వ్యవస్థాపకుడు సీఈవో Mr. రోహిత్ వదేరా తెలిపారు.

ఉపాధి అవకాశాలు మెరుగు

PuREPower ఉత్పత్తులను వినియోగంలోకి తేవడానికి, స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంపొందించడానికి ఈ విస్తరణ ఉపయోగపడుతుంది. బ్యాటరీ టెక్, పవర్-ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ పవర్ సిస్టం, సోలార్ కంట్రోల్ AIని ఒకే ఉత్పత్తిలో సమగ్రపర్చే PuREPower ఉత్పత్తుల ద్వారా విద్యుత్ నిల్వ ఆవిష్కరణల్లో ప్యూర్ సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది. డిజైన్ మేకిన్ ఇండియా నినాదం పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తోంది. 2030 నాటికి దేశ పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాలు 500 GW స్థాయిని అధిగమించనున్న నేపథ్యంలో విద్యుత్ సరఫరా డిమాండ్ మధ్య సమతౌల్యం పాటించేందుకు, గ్రిడ్‌లను స్థిరీకరించేందుకు, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు PuREPower లాంటి ESS ఉత్పత్తులు కీలకంగా ఉండనున్నాయి.