Gold, Silver Price Today| స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు!

బంగారం, వెండి ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 10 తగ్గి.. రూ. 1,56,590 వద్ద కొనసాగుతుంది. కిలో వెండి ధర రూ.100 తగ్గి.. రూ. 2,84,900వద్ద నిలిచింది.

Reported by: Y.V. Narsimha Reddy | వాణిజ్యం | Feb 09, 2026, 9:47 am IST
Read Time: 3 mins
Gold, Silver Price Today| స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు!

విధాత, హైదరాబాద్ : బంగారం, వెండి ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 10 తగ్గి.. రూ. 1,56,590 వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 10 తగ్గి.. రూ. 1,43,540వద్ద నిలిచింది. కిలో వెండి ధర కూడా స్వల్ప తగ్గుదలను మాత్రమో నమోదు చేసింది. కిలో వెండి ధర రూ.100 తగ్గి.. రూ. 2,84,900వద్ద కొనసాగుతుంది.

బంగారం పైకే..వెండి ధరలపై అస్థిరత: మార్కెట్ వర్గాల అంచనా

అమెరికా అనుసరిస్తున్న అంతర్జాతీయ వైఖరులు..ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ, ఆర్థిక పరిణామాల విశ్లేషణల నేపథ్యంలో బంగారం ధరలు తిరిగి బలపడవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే వెండి ధరలు మాత్రం మరికొంత కాలం మరింత కిందకు పడిపోవచ్చంటున్నారు. ముఖ్యంగా యుఎస్ ఫెడరల్ రిజర్వ్ విధానాలు, డాలర్ హెచ్చు తగ్గులు, ద్రవ్యోల్భణం బంగారం వెండి ధరలను ప్రభావితం చేయనున్నాయి.

గత వారం గణాంకాలు చూస్తే.. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం పుంజుకుని.. ఫ్యూచర్స్ ధరలు ఒకే వారం లోపే రూ.7,698 లేదా 5.2 శాతం పెరిగాయి. దీనికి భిన్నంగా వెండి ధరలు రూ. 15,760 లేదా దాదాపు 6 శాతం తగ్గాయి. ఇది వెండి మార్కెట్‌లో తీవ్ర ఒడిదుడుకులను సూచిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ లో COMEXలో బంగారం ధరలు ఒక వారంలో 234.7 డాలర్లు లేదా దాదాపు 5 శాతం పెరిగి ఔన్సుకు 5,000 డాలర్ల స్థాయికి చేరాయి. అదే సమయంలో వెండి ఫ్యూచర్స్ ధరలు 1.63 డాలర్లు లేదా 2.08 శాతం తగ్గాయి. ఈ నేపథ్యంలో ఈ వారం ఫెడ్ ప్రకటనలు, కీలక స్థూల ఆర్థిక డేటా బంగారం-వెండి మార్కెట్ల దిశను నిర్ణయించనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.