Suzuki Burgman Street | 1.02లక్షల్లో 2026 బర్గ్‌మ్యాన్ స్ట్రీట్.. కొత్త ఫీచర్లతో లాంచ్!

Suzuki Burgman Street | సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా భారత మార్కెట్‌లోకి కొత్త స్కూటర్‌ను విడుదల చేసింది. ఇప్పటికే మ్యాక్సీ స్టైల్ డిజైన్‌తో ఇప్పటికే మంచి ఆదరణ పొందిన 125 సీసీ బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్ డిజైన్, ఫీచర్లను అప్‌డేట్ చేసి తీసుకొచ్చింది.

Suzuki Burgman Street | 1.02లక్షల్లో 2026 బర్గ్‌మ్యాన్ స్ట్రీట్.. కొత్త ఫీచర్లతో లాంచ్!

Suzuki Burgman Street | సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా భారత మార్కెట్‌లోకి కొత్త స్కూటర్‌ను విడుదల చేసింది. ఇప్పటికే మ్యాక్సీ స్టైల్ డిజైన్‌తో ఇప్పటికే మంచి ఆదరణ పొందిన 125 సీసీ బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్ డిజైన్, ఫీచర్లను అప్‌డేట్ చేసి తీసుకొచ్చింది.

ఈ కొత్త బర్గ్‌మ్యాన్ స్ట్రీట్‌ను రెండు వేరియంట్లలో తీసుకొచ్చారు. రైడ్ కనెక్ట్ ఎడిషన్, రైడ్ కనెక్ట్ టీఎఫ్‌టీ ఎడిషన్లుగా తెచ్చారు. వీటిలో Ride Connect Edition ధరను రూ.1,01,944 (ఎక్స్ షోరూం ధర, ఢిల్లీ)గా నిర్ణయించారు. ఇక Ride Connect TFT Edition ధరను రూ.1,13,220గా నిర్ణయించారు. ఈ రెండు కొత్త వేరియంట్లతో పాటు పాత Burgman Street Ex మోడల్‌ను విక్రయాలను కూడా కొనసాగించనున్నారు. దీని ధర రూ.1,07,902గా ఉంది.

డిజైన్‌పరంగా ఈ స్కూటర్ ఆకర్షణీయమైన, ఆధునిక థీమ్‌తో మరింత ప్రీమియం లుక్‌ను సంతరించుకుంది. దీని ఆకారం మొత్తం పాతదానిలాగే అనిపించినప్పటికీ.. ఇది మరింత క్లీన్ డీటెయిలింగ్, మరింత ప్రీమియం ఫినిషింగ్‌తో వస్తుంది. ఈ స్కూటీలోని కొత్త ఎలిమెంట్లలో బాడీ మౌంటెడ్ స్ప్లిట్ లెన్స్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, ఇంటిగ్రేటెడ్ పొజిషన్ లైట్లు, కాంపాక్ట్ ఎల్‌ఈడీ ఇండికేటర్లు, అప్‌డేట్ చేసిన ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్, మెటాలిక్ ఫినిష్ చిహ్నాలు, డార్క్ స్మోక్‌డ్ విండ్ స్క్రీన్, మరింత స్టైలిష్‌గా పైకి వంగిన మఫ్లర్ వంటి అప్‌డేట్లు అందించారు. మొత్తం డిజైన్ స్లీక్‌గా, మోడర్న్‌గా కనిపించేలా రూపొందించారు.

డిజైన్‌తో పాటు కంఫర్ట్ విషయంలోనూ సుజుకీ దృష్టి పెట్టింది. లాంగ్ అండ్ వైడ్ ఫుట్‌బోర్డుతో రైడర్లు సౌకర్యంగా కాళ్లు చాచుకుని ప్రయాణించవచ్చు. సీటు కూడా పొడవుగా ఉండి, రైడర్, పిలియన్ ఇద్దరికీ సరిపడా స్థలం ఉంటుంది. ఈ అప్‌గ్రేడ్‌లలో మరింత ఉపయోగకరమైనది సీటు కింద ఉన్న పెద్ద స్టోరేజ్ ఏరియా. దీన్ని 21.5 లీటర్ల నుంచి 24.6 లీటర్లకు పెంచింది. దీనిలో ఇప్పుడు ఫుల్ ఫేస్ హెల్మెట్‌ను కూడా ఉంచుకోవచ్చు.

ఈ స్కూటర్‌లో రెండు ఫ్రంట్ స్టోరేజ్ కంపార్ట్‌మెంట్లు, యూఎస్‌‌బీ చార్జింగ్ పోర్టు, డ్యూయల్ యుటిలిటీ హుక్స్, సెంటర్ స్టాండ్, సైడ్ స్టాండ్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. హయ్యర్ వేరియంట్‌లో కీ లెస్ సిస్టమ్‌తో పాటు రిమోట్ ఫాబ్ ద్వారా సీట్ ఓపెనింగ్, స్టీరింగ్ లాక్, ఫ్యూయల్ లిడ్ కంట్రోల్ సౌకర్యం లభిస్తుంది. అదనంగా సుజుకీ ఈజీ స్టార్ట్ సిస్టమ్ (వన్ పుష్ స్టార్ట్) కూడా అందించారు.

ఈ స్కూటర్ టాప్ వేరియంట్‌లో 4.2 అంగుళాల కనెక్టెడ్ TFT డిస్‌ప్లే ఉంటుంది. దీనిద్వారా టర్న్ బై టర్న్ నావిగేషన్ ఫీచర్లను Burgman Street యాప్ ద్వారా ఉపయోగించుకోవచ్చు.

ఇంజిన్ విషయానికి వస్తే.. 124సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్‌ ఇంజిన్‌తో ఈ స్కూటర్ వస్తోంది. ఇది 8.2 bhp పవర్‌ను 6500 rpm వద్ద 10.2 nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గత మోడల్‌తో పోలిస్తే ఇందులో టార్క్ భారీగా పెరిగింది. ఇక 30-60కి.మీ. వేగంలో మెరుగైన రెస్పాన్స్ కోసం CVT ట్రాన్స్‌మిషన్‌ను కూడా అప్‌డేట్ చేశారు.

ఇంజిన్ స్టార్ట్ సమయంలో శబ్దాన్ని తగ్గించేందుకు రోలర్ టైప్ వన్ వే క్లచ్‌ను ఉపయోగించారు. అలాగే కొత్త మఫ్లర్ డిజైన్ ద్వారా శబ్దాన్ని తగ్గించి మరింత స్మూత్ రైడింగ్ అనుభవాన్ని అందించనున్నారు. ఈ కొత్త బర్గ్‌మ్యాన్ స్ట్రీట్‌లో తేలికపాటి, బలమైన అండర్‌బోన్ ఫ్రేమ్‌ను ఉపయోగించారు. ఇది గతంతో పోలిస్తే సుమారు 500 గ్రాముల తక్కువ బరువు, 25 శాతం ఎక్కువ దృఢత్వాన్ని కలిగి ఉందని సుజుకీ కంపెనీ తెలిపింది. మొత్తంగా చూస్తే కొత్త ఫీచర్లు, మెరుగైన పనితీరు అప్‌డేట్స్‌తో 2026 Burgman Street ప్రీమియం ఫ్యామిలీ స్కూటర్ సెగ్మెంట్‌లో మరింత పోటీని పెంచనుందని ఆటో మొబైల్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Read More:

400CC బైక్‌లకు గుడ్‌బై.. 350 సీసీ ఇంజిన్‌తో బజాజ్ కొత్త స్ట్రాటజీ!

రాయల్ ఎన్‌ఫీల్డ్ సరికొత్త గెరిల్లా 450 బైక్‌ లాంచ్.. Apex వేరియంట్‌తో స్పోర్టీ స్టైల్!